టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న హనుమాన్ చివరి దశకు వచ్చేసింది. ఆరో వారంలో అడుగు పెడుతున్న వేళ రన్ పూర్తవుతున్న విషయాన్ని గుర్తించి నైజాంలో టికెట్ రేట్లు తగ్గింపుకి పూనుకుని వసూళ్లకు మళ్ళీ జోష్ ఇచ్చే ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 23 వరకు నైజామ్ మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 100 రూపాయలు టికెట్ రేట్లు నిర్ణయించి ప్రేక్షకులను మళ్ళీ రప్పించే స్ట్రాటజీ వేశారు. వీకెండ్ తప్ప నిజానికి హనుమాన్ ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. మూడు వందల కేంద్రాల్లో ఉన్నా వసూళ్లు నెమ్మదించాయి.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వంద రూపాయలకు పైగానే డిస్కౌంట్ అంటే ఆడియన్స్ మళ్ళీ ఇంకోసారి చూద్దామనే ఆలోచన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో రెండు వారాలు పూర్తయితే హనుమాన్ అర్ధశతదినోత్సవం చేసుకుంటుంది. పెద్ద నెంబర్ లోనే ఈ మైలురాయిని అందివ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలు చాలా వచ్చినప్పటికీ ఏవీ కనీసం యావరేజ్ అనిపించుకునే స్థాయిలో జనం మెప్పు పొందలేదు. అందుకే ప్రతి శని ఆదివారాలు తిరిగి హనుమాన్ కే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ ఊరుపేరు భైరవకోన ఒకటే నోటెడ్ మూవీ.
ఇప్పుడీ ఎత్తుగడ వల్ల అనూహ్యంగా వందల కోట్లు వచ్చేయవు కానీ డెఫిషిట్లు రాకుండా థియేటర్ మెయింటెనెన్స్ కు సరిపడా కలెక్షన్ అయితే వస్తుంది. రేటు తక్కువ ఉందని ఎక్కువ మంది వస్తే ఖర్చులు పోనూ లాభాలు పెరుగుతాయి. రిలీజ్ చేసిన ప్రతి సెంటర్ లో రూపాయికి రెండు నుంచి పది రూపాయల దాకా లాభం ఇచ్చిన హనుమాన్ మార్చి మొదటి వారంలో ఓటిటి ప్రీమియర్ జరుపుకోవచ్చని టాక్. అందుకే ఏది చేసినా ఇంకో పదిహేను రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి. అక్కడితో హనుమాన్ కథ సుఖాంతమవుతుంది. ప్రభుత్వ పరిమితుల వల్ల ఏపీలో ఈ వెసులుబాటు సాధ్యం కాదు.
This post was last modified on February 16, 2024 5:49 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…