సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ తెర మాంత్రికుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా సరే అభిమానులను విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది. రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలయిక కావడంతో అంచనాలు మాములుగా లేవు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత జక్కన్న చేస్తున్న మూవీ ఇది. పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాయనే వార్తల నేపథ్యంలో షూటింగ్ మొదలుపెట్టక ముందే సంచలనాలు షురూ చేశారు.
ఇంత ప్రతిష్టాత్మక మూవీకి టైటిల్ ఏం పెడతరనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మహారాజా పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ లీకైన సోర్స్ నుంచి విశ్వసనీయంగానే వినిపిస్తోంది. గతంలో దీనికి దగ్గరగా శోభన్ బాబు మహారాజు వచ్చింది కానీ అది ఫక్తు ఫ్యామిలీ సినిమా. మళ్ళీ ఏ స్టార్ హీరో పెట్టుకోలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం మహేష్ కు పర్ఫెక్ట్ ఛాయసని చెప్పాలి. ఇది కాకుండా చక్రవర్తి అనే ఇంకో టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఇది చిరంజీవి ఒకప్పుడు వాడుకున్నారు కానీ ఆ చిత్రం ఎబోవ్ యావరేజ్ అయ్యింది.
సో మహారాజానా చక్రవర్తినా లేక ఇంకేదైనా ట్విస్టుతో కొత్తది లాక్ చేస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం మహేష్ బాబు మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు స్క్రిప్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు అనౌన్స్ మెంట్ ఇవ్వాలనే దాని మీద కసరత్తు జరుగుతోంది. మార్చిలోనా లేక ఉగాది దాక వేచి చూద్దామా అనే దాని మీద ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదట. దుర్గా ఆర్ట్స్ కెఎల్ నారాయణ ప్రధాన నిర్మాత అయినప్పటికీ ప్రొడక్షన్ పార్ట్ నర్స్ ని ఫైనల్ చేస్తే తప్ప ఏదీ అఫీషియల్ గా చెప్పలేరు. ఈలోగా ఎన్నెన్ని లీక్స్ అప్డేట్స్ రూపంలో వస్తాయో వేచి చూడాలి.
This post was last modified on February 16, 2024 1:20 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…