రేపు విడుదల కాబోతున్న ఊరు పేరు భైరవకోన మీద బాక్సాఫీస్ పెద్ద నమ్మకమే పెట్టుకుంది. ఎందుకంటే ఈ వారం చెప్పుకోదగ్గ మూవీ ఇదొక్కటే. రాజధాని ఫైల్స్ కి కోర్టు బ్రేకులు పడ్డాయి. మిగిలిన ఒకటి రెండు చిన్న సినిమాల గురించి కనీస ఊసు లేదు. గత వారం రిలీజైన వాటిలో ఈగల్ ఆల్రెడీ నెమ్మదించిపోగా యాత్ర 2 ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. రజనీకాంత్ ఉన్నా లాల్ సలామ్ ని కనీసం పట్టించుకున్న దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవు. బేబీ రేంజ్ లో ర్యాంప్ ఆడిస్తామని అదే నిర్మాతలు గొప్పగా చెప్పుకున్న తమిళ డబ్బింగ్ ట్రూ లవర్ కనీసం పబ్లిసిటీ ఖర్చులు తేలేదు.
సో ఇప్పుడు భారం మోయాల్సింది ఊరుపేరు భైరవకోననే. రెండు రోజుల ముందే ప్రధాన కేంద్రాల్లో ప్రీమియర్లు వేయడం ద్వారా దర్శక నిర్మాతలు తమ కాన్ఫిడెన్స్ చూపించారు. వాటిని చూసిన వాళ్ళ దగ్గర నుంచి మంచి రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. రియల్ టాక్ ఏంటనేది రేపటికి స్పష్టత వస్తుంది. హారర్ జానర్ అయినప్పటికీ అన్ని వర్గాలు చూడరనే టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే హిట్ కొట్టొచ్చని గతంలో విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, జాంబీ రెడ్డి లాంటివి నిరూపించాయి కాబట్టి టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ ని మెప్పిస్తే చాలు జనాలు హిట్ ఇస్తారు.
సందీప్ కిషన్, నిర్మాత అనిల్ సుంకరకు ఈ సక్సెస్ చాలా కీలకం. అలాగే దర్శకుడు విఐ ఆనంద్ తో చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఊరిపేరు భైరవకోన ఫలితం వాళ్ళను ముందడుగు వేసేలా చేస్తుంది. గత చిత్రం డిస్కో రాజాకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని ఈ సినిమాని పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా మలిచానని ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎలాగూ వచ్చే వారం కూడా హైప్ ఉన్న రిలీజులు లేవు. ఊరిపేరు భైరవకోన నిలబడితే ఎంతలేదన్నా మార్చి 1 దాకా మంచి రన్ దక్కుతుంది. లాభాలు అందుకోవడానికి పదిహేను రోజులు సరిపోతాయి. అందుకే భైరవకోన మీద థియేటర్ల ఆశలన్నీ.
This post was last modified on February 15, 2024 5:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…