బాలీవుడ్ సీనియర్ హీరోలకు అక్కడ అవకాశాలు తగ్గిపోయి కొత్త కెరీర్ వైపు చూస్తున్న తరుణంలో సౌత్ ఇండస్ట్రీ వాళ్లకు కొంగు బంగారంలా మారుతోంది. సంజయ్ దత్ కెజిఎఫ్ పుణ్యమాని ఫుల్ గా సెటిలైపోతే బాబీ డియోల్ ఏకంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు. అర్జున్ రామ్ పాల్ ఆల్రెడీ భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ ఖాతా మొదలుపెట్టాడు. వీళ్ళ కన్నా ముందు జాకీ శ్రోఫ్, సునీల్ శెట్టి ట్రై చేశారు కానీ సరైన సక్సెస్ లేక వెనుకబడ్డారు. ఇప్పుడీ లిస్టులోకి ఇమ్రాన్ హష్మీ చేరుతున్నాడు. అది కూడా రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ తో.
ఇతని గురించి అవగాహన కలగాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి. ఇరవై ఏళ్ళ క్రితం ఇండస్ట్రీ వచ్చిన ఇమ్రాన్ హష్మీకి 2004లో వచ్చిన రెండో సినిమా మర్డర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. మలైకా అరోరాతో కలిసి అతను పండించిన హాట్ రొమాన్స్ కుర్రకారుని పిచ్చెక్కించింది. ఇక తనుశ్రీ దత్తాతో నటించిన ఆషిక్ బనాయా ఆప్నే మాములు సెన్సేషన్ కాదు. యువతని థియేటర్ల దగ్గర బారులు తీరేలా చేసింది. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్, పాగల్ పన్ లాంటి ఎన్నో చిత్రాలు అతనికి స్టార్ డం తెచ్చి పెట్టాయి. ఒకదశలో లిప్ లాక్ స్టార్ గా ప్రేక్షకులు పిలుచుకునేవారు. తర్వాత హిట్లు తగ్గి గ్యాప్ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ ఓజి, అడవి శేష్ గూఢచారి 2 రెండూ ఇమ్రాన్ హష్మీ చేతిలో ఉన్నాయి. ఇటీవలే సల్మాన్ ఖాన్ టైగర్ 3లో విలన్ గా చేశాడు కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అనుకున్నంతగా ఆఫర్లు క్యూ కట్టలేదు. కానీ ప్రతినాయకుడిగా ఇమ్రాన్ ఆహార్యం, స్టయిల్ గా అనిపించే బాడీ లాంగ్వేజ్ మన హీరోలకు సవాల్ విసిరేందుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అందుకే ఏరికోరి మరీ భారీ పారితోషికం ఇచ్చి తెచ్చుకున్నారు. ముద్దుల రేంజ్ నుంచి యాక్షన్ కు షిఫ్ట్ అయిపోయిన ఈ విలక్షణ నటుడికి ఇక్కడ కనక హిట్టు పడితే చక్కగా హైదరాబాద్ లోనే సెటిలైపోవచ్చు.
This post was last modified on February 15, 2024 5:49 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…