మహేష్ కి మధ్యలో ఇంకోటి గ్యారంటీ!

రాజమౌళి డైరెక్షన్లో మహేష్ సినిమా ఖాయం కావడంతో అభిమానులు పరవశంలో ఉన్నారు. మహేష్ తో బాహుబలిని కొట్టే సినిమా తీస్తాడని జక్కన్న మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం మొదలు కావడానికి చాలా సమయం పడుతుంది.

ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలీదు. వచ్చే వేసవిలో కూడా రిలీజ్ డౌట్ అనే టాక్ బలపడింది. ఆ సినిమా పూర్తయి, రిలీజ్ అయి, రాజమౌళి రిలాక్స్ అయి, మరో కథ రెడీ చేసి, వర్క్ షాప్ నిర్వహించి ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలంటే టైం పడుతుంది.

మరోవైపు మహేష్ చేయబోతున్న మలి చిత్ర దర్శకుడు పరశురామ్ ది పూరి స్కూల్. చాలా వేగంగా సినిమా తీసేస్తాడు. అది మొదలవ్వాలే కానీ ఆరు నెలల్లో రిలీజ్ ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.

రాజమౌళి సినిమాకి టైం పడుతుంది కనుక మధ్యలో మహేష్ మరో సినిమా చేసుకునే వీలుంది. అది ఎవరితో చేస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు కానీ అనిల్ రావిపూడి వేగంగా చేస్తాడు కనుక మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వొచ్చు.