చేతి నిండా సినిమాలతో తమన్ ఉన్నంత బిజీగా ఇంకెవరు లేరనుకుంటున్నాం కానీ చాపకింద నీరులా దేవిశ్రీ ప్రసాద్ సైతం క్రేజీ ప్రాజెక్టులతో తన కంబ్యాక్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొంత కాలంగా తన నుంచి వచ్చిన చెప్పుకోదగ్గ ఛార్ట్ బస్టర్స్ ఉప్పెన, రంగస్థలం, పుష్ప 1 ది రైజ్. మిగిలినవన్నీ ఆడియో ప్లస్ బీజీఎమ్ రెండింటిపరంగా అంతగా సక్సెస్ కానివే. అయితే 2024లో మాత్రం ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను క్రేజీ మూవీస్ తో గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాడు. వాటిలో ‘పుష్ప 2 ది రూల్’ మొదటిది. అదిరిపోయే ట్యూన్స్ తో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడనే టాక్ ఆల్రెడీ ఉంది.
సూర్య దర్శకుడు సిరుతై శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘కంగువ’ని ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని రీ రికార్డింగ్ కి ప్రత్యేక శ్రద్ధ వహించడం కోసం దేవి ఎక్కువ టైం అడిగాడట. షూటింగ్, విఎఫెక్స్ ఇంకా బ్యాలన్స్ ఉండటంతో సరిపడా సమయం దొరకనుంది. వీటికన్నా ముందు నాగచైతన్య సాయిపల్లవి ‘తండేల్’ రిలీజ్ కావొచ్చు. చందూ మొండేటి ఏరికోరి మరీ రాకింగ్ స్టార్ ని ఎంచుకున్నాడు. ధనుష్ నాగార్జున కలయికలో ‘శేఖర్ కమ్ముల’ తీస్తున్న సినిమాకు దేవినే మ్యూజిక్. ఒక టిపికల్ కాంబోలో రాబోతున్న ఈ మాఫియా డ్రామాకు బిజీఎం చాలా కీలకం.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దేవి ఖాతాలోనే ఉంది. ఎన్నికలు అయ్యాక పవన్ డేట్స్ ఇచ్చేలోపు పాటలు సిద్ధం చేసి ఉంచుకోవాలి. గబ్బర్ సింగ్ రేంజ్ లో మేజిక్ రిపీట్ చేయాలి. ఇవి కాకుండా విశాల్ ‘రత్తం’ వర్క్ జరుగుతోంది. రెండేళ్లుగా స్పీడ్ బాగా తగ్గించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక్కసారిగా ఆరేసి సినిమాలు చేయడం విశేషమే. మళ్ళీ వింటేజ్ దేవిని వినాలని ఉందని మ్యూజిక్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త సంగీత దర్శకులు ఎందరు వస్తున్నా డిమాండ్ విషయంలో తనదైన రేంజ్ మెయింటైన్ చేస్తున్న దేవికి సరైన హిట్లు పడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు.
This post was last modified on February 15, 2024 1:57 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…