Movie News

శ్రీలీల ‘నో’ చెప్పింది ఇందుకేనా

నిన్న విడుదలైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ యూత్ కి బాగానే కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. మొదటి భాగం కథకు ఖచ్చితమైన కొనసాగింపు కాకపోయినా పాత్రలు వాటి మధ్య సంబంధాలు కంటిన్యూ చేయడంతో ఈసారి ఆసక్తి మరింత ఎక్కువవుతోంది. సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ని దర్శకుడు మల్లిక్ రామ్ సమతూకం చేసిన విధానం క్రేజ్ ని పెంచుతోంది. నిన్న రాత్రే బిజినెస్ కాల్స్ ఎక్కువయ్యాయని సితార కాంపౌండ్ టాక్. వరల్డ్ వైడ్ రైట్స్ కోసం ఒక ఓవర్సీస్ సంస్థ పెద్ద మొత్తాన్ని కోట్ చేసిందని వినికిడి. నిర్మాత నాగ వంశీ తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

ఇక అసలు పాయింట్ కు వస్తే టిల్లు స్క్వేర్ లో ముందు తీసుకున్న హీరోయిన్ శ్రీలీల. కొన్ని సీన్లు షూట్ అయ్యాక తాను చేయలేనని తప్పుకున్నాక అనుపమ పరమేశ్వరన్ ని కలుసుకున్నారు. ఆమె కూడా వెంటనే ఎస్ చెప్పలేదు. కొంత టైం తీసుకుని చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే శ్రీలీల ఎందుకు నో చెప్పిందనే కారణాలు ట్రైలర్ లో కనిపించాయి. సుదీర్ఘమైన లిప్ లాకులతో పాటు ట్రెండీ కాస్ట్యూమ్స్ కు అనుపమ మొహమాటపడకుండా ఒప్పుకుంది. మూడు నిమిషాల వీడియోలోనే అంత ఉంటే ఇక ఫుల్ మూవీలో ఏ స్థాయిలో రొమాన్స్ ఉంటుందో వేరే చెప్పాలా.

ఇలా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందనే శ్రీలీల టిల్లు స్క్వేర్ వద్దనుకుని ఉండొచ్చనే కామెంట్ సహేతుకంగానే ఉంది. ఎందుకంటే ఈమె ఇప్పటిదాకా ఎక్స్ పోజింగ్, ఆధర చుంబనాలు చేయలేదు. కుర్చీ మడత పెట్టి లాంటి ఊర మాస్ పాటలోనూ చీరకట్టు పద్ధతిగానే మేనేజ్ చేసింది. అలాంటిది సిద్దుతో పెదవి పెదవి కలుపుతూ ముద్దులకు అంగీకరించడం కష్టం కదా. మార్చి 29 టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక తన నిర్ణయం రైటా రాంగా అనేది తేలిపోతుంది కానీ మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ లోని కొత్త యాంగిల్ ని పరిచయం చేయడంతో టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెసయ్యాడు.

This post was last modified on February 15, 2024 11:34 am

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago