ఎన్నికల వాతావరణంలో రాజకీయ సినిమాల తాకిడి పెరుగుతోంది. యాత్ర 2తో బోణీ జరిగింది కానీ ఊహించిన దాని కన్నా చాలా తక్కువ ఫలితం దక్కడం నిర్మాతలకు షాకే. ఎల్లుండి రాజధాని ఫైల్స్ ని తీసుకొస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ అంటూ ఎవరు లేరు. దర్శకుడి గురించి ప్రేక్షకులకు తెలిసింది సున్నా. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ లాంటి సీనియర్లు తప్ప మిగిలిన తారాగణమంతా కొత్త మొహాలే కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఏపి అధికార పార్టీ అవలంబించిన విధానాన్ని ఎండగడుతూ ఈ చిత్రం తీసిన వైనం ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది.
ఇదంతా బాగానే ఉంది కానీ బాక్సాఫీస్ వద్ద రాజధాని ఫైల్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది టాక్ ఎలా వస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించి పొలిటికల్ డ్రామాల పట్ల ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. యాత్ర 2లో అది అర్థమైపోయింది. పైగా రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం, శపథంలను కేవలం వారం గ్యాప్ లో విడుదల చేయడానికి సిద్ధ పడటం ఇంకో ఆసక్తికరమైన పరిణామం. తన సినిమాలను జనం పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే కానీ యాత్ర 2 లాగే ఇవి జగన్ కి ఎలివేషన్ ఇవ్వడానికి తీసినవే.
సో రాజధాని ఫైల్స్ ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అంత ఈజీగా చెప్పలేం. పైగా న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ లో కొన్ని వందల వేల సార్లు చదివిన రాజధాని సంఘటనలను మళ్ళీ తెరమీద చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తారా అంటే పండించిన డ్రామా మీద ఆధారపడి ఉంటుంది. భాను దర్శకత్వం వహించిన రాజధాని ఫైల్స్ కి మణిశర్మ లాంటి సీనియర్ మ్యుజీషియన్ ని తీసుకోవడం టెక్నికల్ గా స్థాయిని పెంచింది. ప్రస్తుతానికి దీని మీద ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు రాలేదు. ఒకవేళ షోలు పడ్డాక ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమో చూడాలి.
This post was last modified on February 13, 2024 6:08 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…