స్టార్ హీరో రన్వీర్ సింగ్ దూకుడు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అంతే స్థాయిలో ఉంటుంది. ముందు వెనుక చుట్టుపక్క ఎవరున్నారో పట్టించుకోకుండా తాను అనుకున్నది చేసేయడమే ఇతని స్టైల్. స్వయానా భార్య ప్లస్ హీరోయిన్ దీపికా పదుకునేతో పాటు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె గతంలోని బాయ్ప్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడ్డం అతనికే చెల్లింది. స్టేజి మీద డాన్సులైనా అవార్డు ఫంక్షన్లలో గెంతులైనా మనోడి స్టైల్ వేరు. తాజాగా తనో యాడ్ లో నటించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే బోల్డ్ కేర్ అనే అంతర్జాతీయ సంస్థ సెక్స్ కు సంబంధించిన ఔషధాలు, క్రీములు తయారు చేయడంలో ఎంతో పేరు గాంచింది. దానికి సంబంధించిన ప్రకటనలో రణ్వీర్ సింగ్ తో పాటు జానీ సిన్స్ నటించాడు. ఇతను ఎవరయ్యా అంటే ప్రముఖ పోర్న్ స్టార్. అంటే శృంగార హీరో అన్న మాట. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ ఫోటోగ్రాఫర్ కం యూట్యూబర్ చాలా నీలి చిత్రాల్లో నటించాడు. ఎప్పుడూ గుండుతో ఉండే ఇతనికి ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. విచిత్రం ఏంటంటే ఈ బోల్డ్ కేర్ యాడ్ అచ్చం హిందీ తెలుగు సీరియల్స్ తరహాలో ఓవర్ డ్రామాతో ఉండటం.
జానీ సిన్స్ భార్యగా నటించిన ఆర్టిస్టు తన భర్తకు మగతనం లేదని కుటుంబ సభ్యులు అందరి ముందు చెబుతుంది. దీంతో ఆమె అత్తయ్య చాచి చెంప మీద కొడితే కోడలు పై నుంచి కిందపడిపోతున్న టైంలో బోల్డ్ కేర్ టాబ్లెట్ వేసుకున్న జానీ ఆమెను గాల్లోనే పట్టేసుకుని దింపుతాడు. ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్య రసిక ఆలోచనలు వచ్చేస్తాయి. ఇదంతా చూస్తూ క్లాసులు పీకిన రణ్వీర్ సింగ్ చివర్లో బోల్డ్ కేర్ వాడండి, సెక్స్ సమస్యల నుంచి బయట పడమని సలహా ఇస్తాడు. కంటెంట్, కామెడీ, సెటైర్ అన్నీ పుష్కలంగా ఉన్న ఈ యాడ్ లో వస్తువు కంటే నటించినవాళ్ళు హైలైట్ కావడం ట్విస్టు.
This post was last modified on February 12, 2024 4:59 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…