కమెడియన్లు హీరోలు కావడం చాలాసార్లు జరిగిందే. బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ, రాజబాబు ఇలా ఎందరో స్క్రీన్ మీద కథానాయకులుగా కనిపించారు. సునీల్ ఏకంగా కొన్నేళ్ల పాటు సోలో హీరోగా మార్కెట్ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వెన్నెల కిషోర్ వీళ్ళ బాటలో నడుస్తున్నాడు. కాకపోతే సీరియస్ కామెడీ రెండూ మిక్స్ చేసి చారి 111 పేరుతో స్పై కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇండియా పాకిస్థాన్ మధ్య 1992లో జరిగిన ఒప్పందాన్ని కొందరు శత్రువులు ఉల్లంఘిస్తే దాన్ని ఛేదించే మిషన్ ని చారి ఛేదించడమనే పాయింట్ తో రూపొందించారు.
మాములుగా స్పై డ్రామాలు సీరియస్ గా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం వినోదాత్మకంగా మార్చేశారు. ఒకరకంగా చెప్పాలంటే చిరంజీవి చంటబ్బాయ్ క్యారెక్టరైజేషన్ ని అడవి శేష్ గూఢచారికి కలిపితే ఎలా ఉంటుందో చారి 111 అచ్చం అలా ఉందన్న మాట. దర్శకుడు టిజి కీర్తి కుమార్ ఏదో విభిన్నంగా ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మధ్య చాలా సినిమాల్లో వెన్నెల కిషోర్ చేస్తున్న పాత్రలు రొటీన్ టచ్ తో ఉంటున్నాయి. దాంట్లో అతని తప్పేమి లేకపోయినా తన ఎనర్జీని వాడుకునేలా కామెడీ ఎపిసోడ్స్ రాయలేకపోతున్నారు. మరి చారి 111 ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
బడ్జెట్ గట్రా గట్టిగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. అయినా హాస్య నటుల కోసం థియేటర్లకు ప్రేక్షకుల ఎంత మేరకు వస్తారనేది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మార్చి 1 వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తో పోటీకి సిద్ధమైన ఈ చారికి లోకల్ ప్లస్ ఫారిన్ టచ్ రెండూ ఇచ్చారు. మురళి శర్మకో కీలక పాత్ర దక్కించింది .వెన్నెల కిషోర్ లీడ్ గా గతంలో వెన్నెల వన్ అండ్ హాఫ్ వచ్చింది కానీ ఆడలేదు. చారి 111లో క్వాలిటీ కనిపిస్తోంది. సంక్రాంతి నుంచి కమర్షియల్ సినిమాలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఆడియన్స్ కి ఏమైనా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించి మెప్పితే హిట్టు పడొచ్చు.
This post was last modified on February 12, 2024 1:55 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని…
హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…