దర్శకుడు నాగ అశ్విన్ ఆవిష్కరించబోతున్న విజువల్ వండర్ కల్కి 2898 ఏడి ఇంకో మూడు నెలల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. మాములుగా ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్ల హడావిడి చివరి వారం పది రోజుల్లో ఉంటుంది. దీని వల్ల పబ్లిసిటీ సరిగ్గా జరగక కొంత ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతోందని ఫ్యాన్స్ అంటుంటారు. దానికి భిన్నంగా కల్కికి ప్లాన్ చేసుకున్న ప్రచార పర్వం చూస్తే ఇది కదా కావాల్సింది అనుకునేలా ఉంది. విదేశాల్లో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్ తో మొదలుపెట్టి హైదరాబాద్ లో నిర్వహించిన ఫన్ ఎగ్జిబిషన్ దాకా ప్రతి చోట చేసిన ప్రోగ్రాంస్ హైప్ పెంచుతున్నాయి.
తాజాగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన వంతుగా మూవీ లవర్స్ ఎగ్జైట్ మెంట్ పెంచే పనిలో పడ్డాడు. నిన్న చెన్నై జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఇతని లైవ్ కన్సర్ట్ జరిగింది. సంగీత ప్రియులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అది కాదు విశేషం. కల్కి 2898 ఏడికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కొంత భాగాన్ని ప్రత్యక్షంగా వాయించి ప్రదర్శించడం ద్వారా అసలు సినిమాలో ఏ రేంజ్ అవుట్ ఫుట్ ఉంటుందో ఊహించుకోమంటూ ఊరించాడు. ఇదంతా వైజయంతి మూవీస్ అధికారికంగా ఇచ్చిన అనుమతితో వదిలిన స్కోరే. లైవ్ లో చూసిన ప్రేక్షకులు వావ్ అనకుండా ఉండలేకపోయారు.
ఇలా ఒక పద్ధతి ఒక ప్లానింగ్ ప్రకారం కల్కి విషయంలో నాగ అశ్విన్ తో పాటు నిర్మాతలు స్వప్న ప్రియాంకాలు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే ప్యాన్ ఇండియా మూవీకి సరైన బృందమే దొరికిందని చెప్పాలి. మే 9 రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ట్రేడ్ కు ఆల్రెడీ సమాచారం వచ్చిందట.షూటింగ్ పూర్తయిపోయిందని, ఇప్పుడు షూట్ చేస్తున్నవి కూడా సీక్వెల్ కి సంబంధించినవని అంతర్గత సమాచారం. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు నటిస్తున్న కల్కిలో ప్రభాస్ ఒక సూపర్ పవర్ కలిగిన మనిషిగా కనిపిస్తాడట.
This post was last modified on February 11, 2024 6:32 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…