గత వారం విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సౌండ్ బాగా తగ్గిపోయింది. హీరో హీరోయిన్ తో పాటు టీమ్ థియేటర్ విజిట్లు చేస్తున్నా వసూళ్లు నెమ్మదించాయి. ఈ వారం కొత్త రిలీజుల తాకిడి ఉందనుకున్నా నాలుగో రోజు నుంచే స్ట్రగుల్ కావడం కలెక్షన్ ఫిగర్లలో కనిపించింది. పోస్టర్లలో చెప్పినట్టు ఎనిమిది తొమ్మిది కోట్ల గ్రాస్ ఫస్ట్ వీక్ లోనే వచ్చేసిందనుకున్నా ఆ స్థాయి హడావిడి, స్పందన ఈ సినిమా విషయంలో ఆడియన్స్ చూపించలేదన్నది వాస్తవం. కంటెంట్ పరంగా ప్రశంసలతో పాటు విమర్శలూ అందుకున్న అంబాజీపేట ఫలితం నుంచి ముందు అలెర్ట్ అవ్వాల్సింది సుహాస్.
తనను అణిచివేయబడే సీరియస్ పాత్రల్లో ఆడియన్స్ చూడాలని కోరుకోవడం లేదు. కలర్ ఫోటో ఒకవేళ థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే ఎలా ఉండేదంటే సమాధానం చెప్పడం కష్టం. రైటర్ పద్మభూషణ్ సక్సెస్ కి కారణం అందులో ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ రెండూ బాలన్స్ కావడమే. పెద్దగా కష్టాలు, కన్నీళ్లు ఉండవు. సింపుల్ మెసేజ్ ని వినోదాత్మక రీతిలో చెప్పడం ఫ్యామిలీ జనాలకు నచ్చేసింది. అందుకే హిట్ ఇచ్చారు. లేడీస్ లోనూ గుర్తింపు వచ్చింది. కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో వాళ్లకు దగ్గరయ్యే ఎలిమెంట్స్ తగ్గిపోయాయి. దాని ప్రభావం రిజల్ట్ మీద పడింది.
ఇకపై సుహాస్ తనకు సూటయ్యే కథలో లేదా యాక్టింగ్ ని స్కోప్ ఇచ్చే పాత్రలో ఎంచుకోవడం కాదు,కెరీర్ స్థిరపడాలంటే కాస్త కమర్షియల్ టచ్ ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రయత్నించాలి. తన కొత్త పోస్టర్ చూస్తే పబ్లిక్ లో ఆసక్తి పెరగాలి. నాని, శర్వానంద్ లాంటి హీరోలు మార్కెట్ పెంచుకుంది ఇలాగే. సుహాస్ కు సిద్దు జొన్నలగడ్డ లాగా ట్రెండీ కాన్సెప్ట్స్ సూట్ కావు. నిజమే. కానీ భావోద్వేగాలతో నడిచే కామెడీలు వర్కౌటవుతాయి. ఫ్లాపులతో మునిగితేలుతున్న శ్రీవిష్ణు తిరిగి రేస్ లో నిలబెట్టింది సామజవరగమన లాంటి సినిమానే. త్వరలో సుహాస్ గొర్రె పురాణంతో రాబోతున్నాడు. ఇదెలాంటి బ్రేక్ ఇస్తుందో.
This post was last modified on February 11, 2024 2:42 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని…
హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…