వరసగా యాక్షన్ అండ్ సీరియస్ ఎంటర్ టైనర్లు చేస్తున్న రవితేజ దానికి తగ్గ ఫలితాలు అందుకోలేకపోవడంతో అభిమానులు మళ్ళీ వింటేజ్ మాస్ మహారాజా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ధమాకా తరహా వినోదాన్ని ప్రేక్షకులు ఆశిస్తున్నారు కాబట్టి ప్రయోగాలకు స్వస్తి చెప్పమని అభ్యర్థిస్తున్నారు. నెగటివ్ టచ్ ఉన్న రావణాసుర చేస్తే డిజాస్టర్ దక్కింది. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా టైగర్ నాగేశ్వరరావులో నటిస్తే తృప్తి మిగిలింది కమర్షియల్ గా వచ్చింది నష్టమే. తాజాగా ఈగల్ కూడా డివైడ్ టాక్ తో అద్భుతాలు చేసే దిశగా కనిపించడం లేదు.
సో పెద్ద సక్సెస్ ఇవ్వాల్సిన బరువంతా నెక్స్ట్ రవితేజ చేస్తున్న మిస్టర్ బచ్చన్ మీద పడుతోంది. దీనికి కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మాత. అయితే ఇది ఒకరకంగా సేఫ్ గేమ్ లాంటి మూవీ. అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ రైడ్ కి అఫీషియల్ రీమేక్. కథాపరంగా మంచి గ్రిప్పింగ్ తో సాగే హీస్ట్ థ్రిల్లర్. దర్శకుడు హరీష్ శంకర్ యధాతథంగా తీయకుండా రవితేజ ఇమేజ్ కు తగ్గట్టు కీలకమైన మార్పులు జోడించి మాస్ కి అనుగుణంగా గ్లామర్ కూడా తగిలిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే 80 దశకంలో జరిగే నేపధ్యమే అయినా ప్రాపర్ మాస్ మీటర్ లో ఉంటుంది.
నాగార్జున సైతం ఎక్స్ పరిమెంట్ల జోలికి వెళ్లి వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ చేదు ఫలితాలు చూశాకే తిరిగి నా సామిరంగతో పాత స్కూల్ కు వచ్చేశారు. సోగ్గాడే చిన్ని నాయన అంత ఘనవిజయం సాధించకపోయినా సంక్రాంతి సీజన్ లో చెప్పుకోదగ్గ లాభాలే ఇచ్చింది. రవితేజకు కావాల్సింది ఇలాంటి బ్రేకే. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో ఓ సినిమా చేయబోతున్నాడన్న టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిస్టర్ బచ్చన్ దర్శకుడు హరీష్ శంకర్ తో షాక్, మిరపకాయ్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో అతని టేకింగ్ మీద ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. వేసవిలోనే రిలీజ్ ఉంటుంది.
This post was last modified on February 11, 2024 10:01 am
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…