తాజాగా విడుదలైన ఈగల్ కు డివైడ్ టాక్ నడుస్తోంది. పూర్తి యాక్షన్ కంటెంట్ తో ఆ జానర్ పప్రేమికులను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొంత మేర సంతృప్తి పరిచినా సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంత డోస్ ఎక్కడం లేదని టాకులు, రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. సరే ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకొంచం టైం పడుతుంది కానీ ఈగల్ ఎండ్ క్రెడిట్స్ లో టీమ్ చిన్న షాక్ ఇచ్చింది. అదే ఈగల్ 2. సలార్ కు శౌర్యంగ పర్వం లాగా దీనికి యుద్ధకాండ అని నామకరణం చేశారు. మొదటి భాగం తలకోనలో జరిగితే రెండో భాగం విదేశాల్లో ఉంటుందనే రీతిలో కొన్ని విజువల్స్ కూడా చూపించారు.
కాకపోతే నిజంగా తెరకెక్కిస్తారా లేదానేది వేచి చూడాలి. ఆ మధ్య స్కందలోనూ బోయపాటి శీను ఇలాగే ఊరించాడు. తీరా డిజాస్టర్ అయ్యేసరికి అందరూ గప్ చుప్. కథను అసంపూర్ణంగా ముగించినప్పటికీ కంటిన్యూ చేసే ఛాన్స్ లేనట్టే. కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా ఇదే తరహాలో సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందు ప్రమోషన్లలో, రిలీజయ్యాక క్లైమాక్స్ లో చెప్పారు. కానీ దర్శక నిర్మాత అభిషేక్ నామా అంత సుముఖంగా లేరని అర్థమవుతోంది. ఇప్పుడు ఈగల్ 2 యుద్ధకాండ నిజంగా కార్యరూపం దాలుస్తుందా అంటే సమాధానం నిర్మాత టిజి విశ్వప్రసాద్ దగ్గరే ఉంది.
ఏది ఏమైనా షూటింగ్ స్టేజిలోనే ఇలా పార్ట్ 2లకు తగ్గట్టు ఎండింగ్ లు రాసుకోవడం అంతగా వర్కౌట్ కావడం లేదు. సైంధవ్ కు శైలేష్ కొలను ఇలాగే చేయబోయి చేతులు కాల్చుకున్నాడు. వెంకటేష్ పోషించిన సైకో పాత్రకు ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లోనే చూపించి ఉంటే కంటెంట్ స్థాయి పెరిగేది. కానీ దాన్ని రెండో భాగం చూపించాలనే తాపత్రయంలో సైంధవ్ ని సాగదీయడంతో అభిమానులకే నచ్చలేదు. మరి ఈగల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చివరి ఫలితం వచ్చాక తేలుతుంది. కార్తీక్ ఘట్టమనేని ఆల్రెడీ మంచు మనోజ్- తేజ సజ్జలతో ఇంకో మూవీ చేస్తున్నాడట.
This post was last modified on February 10, 2024 7:59 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…