ఎలాంటి అంచనాలు లేకుండా గత అక్టోబర్ లో విడుదలైన బాలీవుడ్ మూవీ 12త్ ఫెయిల్ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చాక కూడా దీనికి సంబంధించిన ఏదో ఒక విశేషం నమోదవుతూనే ఉంది. తాజాగా ఐఎండిబి ప్రకటించిన టాప్ 250 ప్రపంచ సినిమాల్లో ఈ మూవీ 50వ స్థానం దక్కించుకుంది. ప్రత్యేకత ఇది కాదు. యాభై లోపు ఇంకే భారతీయ చిత్రం లేకపోవడం ఈ కల్ట్ క్లాసిక్ స్థాయి ఏంటో తెలియజేస్తోంది. ఇలాంటివి విన్నప్పుడు చనిపోయినా పర్వాలేదనిపిస్తోందని దర్శకుడు విధు వినోద్ చోప్రా చెప్పడం చూస్తే ఎంత ఎమోషనలయ్యారో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి 12 ఫెయిల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు విధు వినోద్ చోప్రా భార్య ప్రముఖ క్రిటిక్ అనుపమా చోప్రా ఫస్ట్ కాపీ చూసి డైరెక్ట్ ఓటిటికి ఇచ్చేయమని చెప్పారు. దీన్ని థియేటర్లకు వచ్చి ఎవరూ చూడరని జీవిత భాగస్వామే చెప్పడంతో ఆయన అయోమయానికి గురయ్యారు. అయితే ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ముప్పై లక్షలు రావడమే గొప్పని బెదిరించినా సరే నెరవకుండా రిలీజ్ చేసుకున్నారు. కట్ చేస్తే వంద కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇటీవలే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తే మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
సినిమా నచ్చితే చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చెప్పేందుకు 12త్ ఫెయిల్ గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. మన దగ్గర బలగం లాంటివి ఈ సత్యాన్నే ఋజువు చేశాయి. బడ్జెట్ ఎంత పెట్టారనే దానికన్నా ఎంత బాగా తీశారనేదే జనాలు పట్టించుకుంటున్నారు. 12త్ ఫెయిల్ ని ఆస్కార్ కు పంపించే ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేదు. రిలీజ్ టైంలో తెలుగు డబ్బింగ్ చేసినా సరైన ప్రమోషన్లు లేక మన దగ్గర రీచ్ రాలేదు. హీరో విక్రాంత్ మాస్సే డిమాండ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళింది. రాజ్ కుమార్ హిరానీ నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
This post was last modified on February 9, 2024 8:57 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…