ఈ వారం వచ్చిన కొత్త సినిమాల భవితవ్యం మెల్లగా తేలిపోతోంది. యాత్ర 2 పట్ల అధికార పార్టీ అభిమానులు సంతృప్తికరంగా ఉన్నా సామాన్య ప్రేక్షకులకు ఈ పొలిటికల్ డ్రామా ఏమంత రుచించడం లేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఈగల్ కు వచ్చిన మిక్స్డ్ టాక్ చివరికి ఏ స్టేటస్ ఇస్తుందో ఇంకో రెండు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ధమాకా తరహాలో పికప్ అవుతుందా లేదా రావణాసుర లాగా సారీ చెబుతుందా చూడాలి. ఇక మార్నింగ్ షోలకే నానా తిప్పలు పడిన లాల్ సలాంకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. ఇకపై మెరుగుపడే సూచనలు తక్కువే. ఏదో అద్భుతం జరిగితే తప్ప.
ఈ నేపథ్యంలో రేపు ట్రూ లవర్ వస్తోంది. తెలుగువాళ్లకు తెలిసిన మొహాలు పెద్దగా లేవు. ఒక్క శ్రీగౌరీ ప్రియ మాత్రమే అంతో ఇంతో పరిచయం. హీరో మణికందన్, దర్శకుడు ప్రభురాం వ్యాస్ తో సహా అందరూ చెన్నై బ్యాచే. ట్రైలర్ యూత్ ని ఆకట్టుకునేలా ప్రేమ వ్యవహారాలు, బ్రేక్ అప్స్ తో నిజ జీవితంలో జరిగే సంఘటనలతోనే రూపొందించారు. కంటెంట్ మీద నమ్మకంతో హైదరాబాద్ లో ఇవాళే స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు. దర్శకుడు మారుతీ, నిర్మాత ఎస్కెఎన్ తమిళంలో ఒరిజినల్ కాపీ చూసి మరీ హక్కులు కొని టైం తక్కువగా ఉన్నా సరే రిలీజ్ కు రెడీ చేశారు.
ట్రూ లవర్ టీమ్ కున్న నమ్మకం ఒక్కటే. తక్కువ బడ్జెట్ లో రూపొందిన యూత్ ఫుల్ ట్రెండీ కంటెంట్ కనెక్ట్ అయితే మాత్రం కుర్రకారు ఎగబడి చూస్తారు. బేబీకి జరిగింది ఇదే. ప్రశంసలు విమర్శలు రెండూ వచ్చినా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. కాకపోతే ట్రూ లవర్ కున్న ప్రతికూలత ఒకటే. ఇంకా బజ్ పెరగాలి. కామన్ ఆడియన్స్ కి అంతగా అవగాహన లేకపోవడంతో బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత ఏ సినిమా కనీస స్థాయిలో మెప్పించలేదు. ఒకవేళ ఈ ట్రూ లవర్ కనక పాస్ అయితే వీకెండ్ దాటగానే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. చూడాలి ఏం చేస్తుందో.
This post was last modified on February 9, 2024 5:09 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…