Movie News

భగవంత్ కేసరి – స్కంద రెండూ దులిపేశాయి

ఓటిటిల కాలంలో జనాలు కొత్త సినిమాలను శాటిలైట్ ఛానల్స్ లో చూడటం బాగా తగ్గించేశారు. అందుకే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే టిఆర్పి రేటింగ్స్ రావడం కష్టమైపోయింది. గత ఏడాది బలగం, వీరసింహారెడ్డి లాంటి వాటికి మినహాయించి మిగిలినవి పెద్దగా అద్భుతలేం చేయలేదు. వాల్తేరు వీరయ్య సైతం వెనుకబడింది. తాజాగా భగవంత్ కేసరికి వేసిన ప్రీమియర్ కు అర్బన్ నుంచి ఏకంగా 9.36 రేటింగ్ రావడం విశేషం. ఇంకోవైపు స్కందకు 8.47 నమోదు కావడం గమనార్హం. రెండింటి బాక్సాఫీస్ ఫలితాలు ఒకటే కాకపోయినా బుల్లితెరపై మాత్రం దుమ్ము దులపడం విశేషం.

ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. బాలయ్యకు ఇళ్లలో ఉన్న ఫాలోయింగ్ వాటిలో ప్రధానమైంది. గత ఏడాది వీరసింహారెడ్డి, అంతకు ముందు అఖండ సైతం టీవీలో భారీ స్పందన దక్కించుకున్నాయి. భగవంత్ కేసరిలో శ్రీలీల సెంటిమెంట్ ప్రధాన ఎలిమెంట్ గా మారడంతో చూసే వాళ్ళ కౌంట్ పెరిగింది. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురైన స్కందకి ఈ స్థాయిలో జనాలు చూడటం ఆశ్చర్యమే. థియేటర్లలో రిలీజైన టైంలో నెగటివ్ టాక్ విని దూరంగా ఉండిపోయిన ఆడియన్స్ ఎక్కువ. వాళ్లంతా టీవీ ప్రీమియర్ చూసి ఆ ముచ్చట తీర్చుకున్నారు.

దర్శకుడు బోయపాటి శీనుకి గతంలో వినయ విధేయ రామకు ఇలాగే జరిగింది. బాక్సాఫీస్ వద్ద సినిమా దారుణంగా పోతే ఛానల్ లో ఎన్నిసార్లు వచ్చినా మంచి రేటింగ్స్ తో భారీ ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఓటిటిల వల్ల శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న టైంలో ఇలాంటి రేటింగ్స్ ఎంతైనా నిర్మాతలకు ఊపిరినిచ్చేవే. డిజిటల్ మార్కెట్ వల్ల టీవీ చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. వేసిన టైంలో యాడ్స్ ని భరిస్తూ మూడు గంటల సేపు కూర్చునే ఓపిక తగ్గిపోతోంది. అందుకే టిఆర్పి తగ్గుదల కనిపిస్తోంది. ఇప్పటికీ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

This post was last modified on February 8, 2024 6:05 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

1 hour ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

1 hour ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

3 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

5 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

5 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago