గామి.. ఎప్పుడో ఐదేళ్ల ముందు మొదలైన సినిమా ఇది. విశ్వక్సేన్ హీరో. విద్యాధర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇది క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన సినిమా చిత్రం కావడం విశేషం. చిన్న సినిమాలకు సోషల్ మీడియాలో క్యాంపైనింగ్ చేయడం ద్వారా క్రౌడ్ ఫండింగ్ తెచ్చుకుని సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. ‘మను’ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఐతే ఇది ఆ తరహా చిన్న చిత్రం కాదు.
ఇందులో హీరో ఒక అఘోరా. హిమాలయాల్లోని కళ్లు చెదిరే లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. ఎంతో కసరత్తు చేసి భారీ సెట్టింగ్స్ వేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రాధాన్యమున్న సినిమా ఇది. మొత్తంగా చూస్తే ఇదొక ఎపిక్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది.
ఇలాంటి భారీ విజన్‌తో ముడిపడ్డ సినిమాను క్రౌడ్ ఫండింగ్‌తో తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఐతే చిత్రీకరణ ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉండడం.. షూట్ ముందుకు సాగుతుండగా.. బడ్జెట్ సమస్యలు ఎదురు కావడం.. షూటింగ్ ఆగడం.. చిత్ర బృందం రాజీ పడకుండా మళ్లీ క్యాంపైనింగ్ నడిపి డబ్బులు పోగు చేసుకుని షూట్ కొనసాగించడం.. చివరికి చిత్ర బృందం కష్టం, తపనను గమనించిన యువి క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్టుకు సహకారం అందించడం.. ఇలా చివరికి మొదలైన నాలుగైదేళ్ల తర్వాత కానీ ఈ సినిమా పూర్తి కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. సినిమా మార్చి 8న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చూస్తే.. విజువల్స్ వావ్ అనిపించాయి. టీం కష్టమంతా అందులో కనిపించింది. ఇదిమామూలు సినిమా కాదనే ఫీలింగ్ కలిగింది ఆ వీడియో చూస్తే. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. కచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ అవ్వడం ఖాయం. క్రౌడ్ ఫండింగ్‌తో ఇలాంటి భారీ సినిమా తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తే మున్ముందు ఇలాంటి మంచి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on %s = human-readable time difference 2:19 pm
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…