Movie News

బాక్సాఫీస్ పోరు – 3 రోజుల్లో 4 సినిమాలు

మరో ఆసక్తికరమైన క్లాష్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ రెడీ అవుతోంది. మాములుగా ఒకే శుక్రవారం అన్నీ తలపడే ట్రెండ్ కి భిన్నంగా సంక్రాంతి తరహాలో మూడు రోజుల్లో నాలుగు సినిమాలు బరిలో దిగడం ఆసక్తి రేపుతోంది. ఇవాళ ‘యాత్ర 2’ థియేటర్లలో అడుగు పెట్టేసింది. ఓపెనింగ్స్ పరంగా ఆశ్చర్యపరిచేలా ఎలాంటి పరిణామాలు లేవు కానీ జగన్ ని కీర్తిస్తూ తీసిన సినిమా కాబట్టి ఏపీ అధికార పార్టీ తరఫున ఉచిత టికెట్ల పంపకాలు, పార్టీ అభిమానులను హాళ్లకు పంపిస్తున్న వైనాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. యాత్ర టైంలో వచ్చిన సానుభూతి వేవ్ ఎందుకో యాత్ర 2 విషయంలో కనిపించడం లేదు.

రేపు రవితేజ ‘ఈగల్’ పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ కిల్లర్ గా బరిలో దిగుతోంది. సోలోగా పెద్ద బ్లాక్ బస్టర్ అవసరమైన తరుణంలో ఆ లోటుని ఈ సినిమా తీరుస్తుందనే నమ్మకం హీరో కంటే అభిమానుల్లో ఎక్కువ కనిపిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్ ఉన్నా ‘లాల్ సలామ్’ మీద పెద్దగా బజ్ లేకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. తమిళంలోనూ దీని గురించి అతిగా ఊహించుకోవడం లేదు. సమయాభావం వల్ల తెలుగులో ప్రమోషన్లు చేయకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. పైగా నేరుగా ఈగల్ తో తలపడాల్సి రావడం సులభం కాదు.

ఫిబ్రవరి 10 శనివారం ‘ట్రూ లవర్’ వస్తోంది. ఇందులో స్టార్ క్యాస్టింగ్ లేదు. ఆధునిక యువతీ యువకుల్లో జరిగే ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్పులు, స్నేహాలు కాన్సెప్ట్ మీద రూపొందింది. ప్రేమిస్తే తరహాలో ఇదీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో మారుతీ, ఎస్కెఎన్ లు సంయుక్తంగా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తున్నారు. ట్రైలర్ యూత్ లో ఆసక్తి రేపింది కానీ చెప్పుకోదగ్గ క్రేజ్ అయితే రాలేదు. ఇక్కడ చెప్పిన నాలుగు సినిమాలకూ టాక్ చాలా కీలకం కానుంది. ఉన్నవాటిలో ఈగల్ కే ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుండగా బాగుందనే మాట తెచ్చుకుంటే చాలు మిగిలిన పని రవితేజ పూర్తి చేస్తాడు.

This post was last modified on February 8, 2024 1:38 pm

Share

Recent Posts

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

1 minute ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

9 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

3 hours ago