Movie News

హనుమాన్ పరుగులు పూర్తవుతున్నాయి

సంక్రాంతికి చిన్న అంచనాలతో వచ్చి తొంబై రెండేళ్ల సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న హనుమాన్ దాదాపుగా శాంతించాడు. మూడు వందల కోట్ల గ్రాస్ వరకు దూకుడుగానే ఉన్నా నాలుగు వారాలు దాటబోతున్న తరుణంలో బాగా స్లో అయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే ఫైనల్ రన్ కి దగ్గరగా ఉన్నట్టే. ప్రధాన కేంద్రాల్లో వీకెండ్ ఆక్యుపెన్సీలు బాగానే నమోదవుతుండగా మాములు రోజుల్లో పలు చోట్ల డెఫిషిట్లు మొదలైపోయాయి. కాకపోతే అప్పటిదాకా వసూలైన గ్రాస్ కోణంలో చూసుకుంటే ఏ కోశానా పైసా నష్టం వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు.

థియేట్రికల్ రన్ బాగుందని ఓటిటి రిలీజ్ ని మార్చికి వాయిదా వేసిన జీ5 మళ్ళీ నిర్ణయం ఏమైనా మార్చుకుంటుందేమో చూడాలి. ఈ వారం మొత్తం నాలుగు కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈగల్, యాత్ర 2, లాల్ సలామ్, ట్రూ లవర్ లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్ లు ఓటిటిలో వచ్చేశాయి. ఫిబ్రవరి 15 నా సామిరంగ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు టాక్. కెప్టెన్ మిల్లర్, ఆయలాన్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా థియేటర్లలో తీసేశారు. మిగిలింది హనుమాన్ ఒక్కటే. ఇంకో వారం పది రోజుల కంటే ఎక్కువ కొనసాగలేకపోవచ్చు.

లెక్కల సంగతి ఎలా ఉన్నా బాక్సాఫీస్ మీద బలమైన ముద్ర వేయడంతో హనుమాన్ సక్సెస్ సాధించాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్, నిర్మాత నిరంజన్ రెడ్డిలు అమెరికాలోనే ఉంటూ ప్రమోషన్లు ఆపకుండా చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడొచ్చే కొత్త రిలీజుల్లో ఏమైనా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే దాని ప్రభావం ఉంటుంది. లేదూ అంటే శని ఆదివారాలు హనుమాన్ కి ఇంకో ఛాన్స్ దొరికినట్టే. నాలుగు వందల కోట్ల గ్రాస్ అందుకుంటుందేమోననే అంచనా నిజమయ్యే అవకాశం లేదు . ట్రిపుల్ సెంచరీతోనే పరుగు ఆపాల్సి వచ్చేలా ఉంది.

This post was last modified on February 8, 2024 10:37 am

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

24 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

38 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

1 hour ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago