రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో చాలా వరకు మాస్ మసాలా సినిమాలే. రవితేజ పక్కా మాస్ సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుంటుంది. వాటికి మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. అలా అని రవితేజ ఎప్పుడూ రొడ్డకొట్టుడు సినిమాలే చేస్తాడనేమీ లేదు. మధ్య మధ్యలో ప్రయోగాత్మక కథలూ చేస్తున్నాడు. అలాంటి కథలను నమ్మి చాలా సిన్సియర్‌గా నటించాడు కూడా. కానీ అతనెంత బాగా చేసినా కూడా తన శైలికి భిన్నమైన సినిమాలు చేసిన ప్రతిసారీ నిరాశే ఎదురైంది.
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, సారొచ్చారు, డిస్కో రాజా, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు.. ఇలా ఈ వరుసలో చెప్పుకోవడానికి చాలా సినిమాలే ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాల్లో విషయం ఉన్నా కూడా సరిగా ఆడలేదు. దీంతో రవితేజ డిఫరెంట్ సినిమా చేస్తే నిరాశ తప్పదు అనే అభిప్రాయం బలపడిపోయింది.
ఈ నేపథ్యంలో రవితేజ కొత్త సినిమా ఈగల్ మీద అందరూ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇది కొంచెం ప్రయోగాత్మక కథతోనే తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మాస్ అంశాలకు లోటు లేకపోయినా ఫక్తు మాస్ రాజా మార్కు సినిమాలా అయితే కనిపించడం లేదు. ట్రైలర్ చూసి కథ మీద ఒక అంచనాకు రాలేని పరిస్థితి. కార్తీక్ ఘట్టమనేని ఇంతకుముందు సూర్య వెర్సస్ సూర్య అనే ప్రయోగాత్మక సినిమానే తీశాడు. ఈసారి మాస్ అంశాలు జోడిస్తూనే మాస్ రాజాను భిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు.
ప్రోమోలు చూస్తే మాత్రం ఈగల్ స్పెషల్ మూవీలా కనిపిస్తోంది. రవితేజ సహా అందరూ సినిమా మీద చాలా ధీమాగా ఉన్నారు. మరి డిఫరెంట్ మూవీస్ చేస్తే కలిసిరావన్న సెంటిమెంట్‌ను మాస్ రాజా ఈసారైనా బ్రేక్ చేస్తాడేమో చూడాలి. శుక్రవారమే ఈగల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
This post was last modified on February 8, 2024 6:22 am
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…