విడుదల తేదీల వాయిదా ప్రహసనం కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ లో రావాల్సిన విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ని మార్చి 8 రిలీజ్ చేస్తునట్టు గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడది జరగడం లేదు. డేటు, హీరో రెండు యధాతథంగా ఉండిపోయి కేవలం సినిమా మారుతోంది. అదే తేదీకి ‘గామి’ని రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమ్ పాల్గొని దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్న గామికి ఈ సంవత్సరం మోక్షం దక్కుతోంది. విశ్వక్ అఘోరాగా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు.
షూటింగ్ ఆలస్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు అవసరమైన సమయం లేకపోవడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరికి బ్రేక్ వేయక తప్పలేదట. ఇది కాకుండా సంగీతం అందిస్తున్న యువన్ శంకర్ రాజాకు ఇటీవలే సోదరి భవతారిణి అకాల మరణం తన కుటుంబంలో విషాదాన్ని నింపింది. అందుకే రీ రికార్డింగ్ కి ఎక్కువ టైం అవసరం పడటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రౌడీ ఫెలో – చల్ మోహనరంగ ఫేమ్ చైతన్య కృష్ణ దర్శకుడు. నిజ జీవిత ఘటనల ఆధారంగా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో తెరకెక్కించారని టాక్ ఉంది.
ఇక గామి విషయానికి వస్తే విద్యాధర్ దర్శకుడు. తొలుత క్రౌడ్ ఫండింగ్ తో మొదలై తర్వాత కంటెంట్ విస్తరించి పెద్ద చేతులు చేయూతనిచ్చాయి. నిజమైన కుంభమేళాను షూట్ చేసిన తొలి చిత్రంగా గామి అరుదైన ఘనతను అందుకోనుంది. హిమాలయాలు, కాశి తదితర క్లిష్టమైన లొకేషన్లలో గామి షూటింగ్ చేశారు. చాందిని చౌదరి, అభినయ, హారిక, కార్తీక్ శబరీష్ తదితరులు ఇతర తారాగణం. కమర్షియల్ అంశాలకు దూరంగా ఒక విభిన్నమైన అనుభూతిని గామి ఇస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. గ్యాంగ్స్ తప్పుకున్నా గామితో వస్తున్న విశ్వక్ సేన్ ఈసారి హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on February 7, 2024 6:18 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…