టిల్లు బాయ్ గా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ మెల్లగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు జాక్ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ సిద్దు బర్త్ డే సందర్భంగా చిన్న వీడియో రూపంలో టైటిల్ రివీల్ చేశారు. అయితే తమ రెగ్యులర్ స్కూల్ కి భిన్నంగా హీరో, డైరెక్టర్ ఇద్దరూ కొత్త రూటు పట్టారు. యాక్షన్ జానర్ ని ఎంచుకుని ఎక్స్ పరిమెంట్ చేయబోతున్న సంకేతం ఇచ్చారు.
సిద్దుకి బ్రేక్ ఇచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు రాబోయే టిల్లు స్క్వేర్ అన్నీ యూత్ ని టార్గెట్ చేసుకున్నావే. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నవి కాదు. అయినా వాళ్ళ ఆమోదం దక్కింది. నీరజ కోనతో చేస్తున్న తెలుసు కదా సైతం ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనరే. వీటికి భిన్నంగా జాక్ లో క్రైమ్, యాక్షన్ కలగలిసిన డిఫరెంట్ కంటెంట్ ఉంటుందని యూనిట్ టాక్. ఇలాంటి మేకోవర్ సిద్ధూకి అవసరమే. ఎందుకంటే ఒక తరహా పాత్రలకు కట్టుబడితే తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడం కష్టం. అందుకే జాక్ తో పూర్తిగా రూటు మార్చేశాడు.
ట్యాగ్ లైన్ కొంచెం క్రాక్ అని పెట్టడం కూడా దానికి సంకేతమే. యూనిట్ లీక్ ప్రకారం ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. విడుదలకి ఇంకా ఫలానా టార్గెట్ అంటూ ఏమీ పెట్టుకోలేదు. టిల్లు స్క్వేర్ మార్చ్ 29 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో దాని మీద సిద్దు చాలా ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడిని మార్చి మరీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీని కోసమే రెండేళ్ళకు పైగా ఖర్చు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ ఆరంజ్-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి క్యూట్ స్టోరీస్ డీల్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్ తో యాక్షన్ కథకు చేతులు కలపడం విశేషమే.
This post was last modified on February 7, 2024 3:12 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…