టాలీవుడ్ ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి బాక్సాఫీస్ రికార్డులకు గ్రామర్ నేర్పించిన సినిమాల్లో ముందు నిలబడే మూవీ సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతికి రిలీజై భారీ పోటీని తట్టుకుని, కొన్ని కేంద్రాల్లో ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్న అవాంతరాలను తట్టుకుని పండగ విజేతగా నిలవడం మర్చిపోలేని చరిత్ర. చాలా థియేటర్లు ఈ చిత్రం ఇచ్చిన లాభాలతో రీ మోడలింగ్ చేసుకోవడం, సౌండ్ సిస్టం ఆధునీకరించుకోవడం లాంటివి చేశారని పత్రికల్లో వచ్చిన కథనాలకు లెక్క లేదు. 29 కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ ఆడటం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.
ఇప్పుడీ ఆల్ టైం బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మార్చి 2 ప్రపంచవ్యాప్తంగా రీ మాస్టర్ చేసిన ప్రింట్ తో పాటు 7.1 డాల్బీ సౌండ్ లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి యువతకి దీని కల్ట్ ఫాలోయింగ్ గురించి అవగాహన ఉండకపోవచ్చు. సమరసింహారెడ్డిగా బాలయ్య విశ్వరూపం, ఫస్ట్ హాఫ్ లో అబ్బులుగా కామెడీ ప్లస్ ఎమోషన్ పండించిన విధానం, సిమ్రాన్ అంజలా ఝవేరిల గ్లామర్, మణిశర్మ అదిరిపోయే సంగీతం వెరసి ఇదో కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే సీమ ఫ్యాక్షన్ ని ఆధారంగా చేసుకుని తర్వాత వందకు పైగానే సినిమాలొచ్చాయి.
ఈ మధ్య బాగా నెమ్మదించిన రీ రిలీజ్ ట్రెండ్ కు కెమెరామెన్ గంగతో రాంబాబు తిరిగి శ్రీకారం చుట్టగా ఇకపై మళ్ళీ ఒక్కొక్కటి క్యూ కట్టబోతున్నాయి. రవితేజ కిక్ ని కూడా మార్చ్ 2 ప్లాన్ చేసుకున్నారు. 2022 లో మొదలైన ఈ పాత సినిమాల తాకిడి గత ఏడాది పీక్స్ కు చేరుకుంది. పోకిరి, ఖుషి, ఒక్కడు, ఆరంజ్ లకు అభిమానులు చేసుకున్న సెలబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. సమరసింహారెడ్డికు కూడా అదే స్పందన ఆశించవచ్చు. గతంలో నరసింహనాయుడు చేశారు కానీ పబ్లిసిటీ లోపం వల్ల భారీ రీచ్ రాలేదు. అందుకే ఈసారి ముందు జాగ్రత్త చర్యగా నెల నుంచే ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on February 7, 2024 1:54 pm
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…