ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో రూపొందుతున్న ది రాజాసాబ్ మీద ప్రకటన టైంలో అంచనాలు పెద్దగా లేవు కానీ క్రమంగా బజ్ పెరుగుతోంది. ఆ మధ్య లుంగీలో ఒక మాస్ లుక్ వదిలాక ఒక్కసారిగా హైప్ లో మార్పొచ్చేసింది. ప్రభాస్ కటవుట్ ఉంటే ఇంత అంశాల గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సినిమా హారర్ జానరనే ప్రచారం అనుమానాలు రేకెత్తించింది. అయితే ఊహించని చాలా అంశాలు ఇందులో ఉంటాయని, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ చెబుతున్న మాటలు ఒక్కసారిగా ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
ఆయన చెప్పడమని కాదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న విషయాలు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ప్రభాస్ మేకోవర్ ఆశ్చర్యపరిచేలా ఉండటంతో పాటు తన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం షాకింగ్ గా ఉంటుందట. డార్లింగ్ లోని చిలిపితనం, మిర్చిలోని సీరియస్ నెస్ రెండూ మిక్స్ చేసి మారుతి సర్ప్రైజ్ చేస్తాడట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ కు ముందు జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ లో ఓ రేంజ్ లో పేలతాయట. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ లో తక్కువగా మాట్లాడిన ప్రభాస్ ఈ రాజా సాబ్ లో మాత్రం గలగల మాట్లాడుతూనే ఉంటాడట.
సో పైకి కనిపిస్తున్న రాజాసాబ్ వేరే, లోపల చేస్తున్న రచ్చ వేరేని అర్థమైపోయింది. విడుదల మాత్రం వచ్చే ఏడాది ఉండనుంది. సంక్రాంతికి యువి క్రియేషన్స్ విశ్వంభర ఉంది కాబట్టి దానికి పోటీగా నిలిచేందుకు ప్రభాస్ స్వతహాగా ఇష్టపడడు. ఒకవేళ అది వాయిదా పడే సూచనలు ఉంటే అప్పుడు పండగ స్లాట్ తీసుకుంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డిసెంబర్ లో సోలోగా రావడమే మేలనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న రాజా సాబ్ కు తమన్ సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.
This post was last modified on February 7, 2024 11:52 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…