మాస్ మహారాజా రవితేజ ఈగల్ టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. జిఓలో వెసులుబాటు ఉందనే సాకుతో మొదటి వారమే వీలైనంత రాబట్టుకునే ట్రెండ్ కి భిన్నంగా రెగ్యులర్ ప్రైజ్ తో వెళ్లాలని డిసైడ్ చేయడం సానుకూల ఫలితం ఇచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణలో మల్టీప్లెక్స్ 200, సింగల్ స్క్రీన్ 150 రూపాయలకు పరిమితం చేయడం ద్వారా ఎక్కువ సామాన్యులు చూసే వెసులుబాటు కలుగుతుంది. గరిష్ట పరిమితి 295 పెట్టే ఛాన్స్ ఉన్నా దాని జోలికి వెళ్ళకపోవడం ఫుట్ ఫాల్స్ ని పెంచుతుంది. ఓపెనింగ్స్ బాగా వస్తాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలను మొదటి రోజే థియేటర్లకు వచ్చేలా చేయడం పెద్ద ఛాలెంజ్. రవితేజ రేంజ్ స్టార్ హీరోకు ఇది టెన్షన్ పడాల్సిన విషయం కాకపోయినా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫలితాల ప్రభావం ఈగల్ మీద ఉంది. అందుకే మంచి కంటెంట్ ని చేరువ చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. టికెట్ కు 95 రూపాయలు వదులుకోవడం కొంచెం రిస్క్ గా అనిపించినా పది మంది వచ్చే స్థానంలో పాతిక మందిని టికెట్లు కొనేలా చేయడం ద్వారానే ఎక్కువ లాభాలు వస్తాయి. సంక్రాంతికి టికెట్ హైక్ అడగకుండానే హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.
పరీక్షల సీజన్ దగ్గరగా ఉండటం వల్ల సాధారణంగా ఫిబ్రవరి కొంచెం డ్రైగానే ఉంటుంది. అందుకే ఈగల్ నిర్మాతలు కంటెంట్ మీద ఎంత నమ్మకంతో ఉన్నా టికెట్ ధరల గురించి తెలివైన ఎత్తుగడ వేసుకున్నారు. కార్తీక ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కమర్షియల్ అంశాల పాటు రైతులకు సంబంధించిన ఓ కీలక సమస్యకు కొత్త తరహా ట్రీట్ మెంట్ ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు కాగా నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు ఇతర క్యాస్టింగ్. పోటీలో యాత్ర 2, లాల్ సలామ్, ట్రూ లవర్ లున్నాయి.
This post was last modified on February 6, 2024 11:14 am
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…
మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…
ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…