Movie News

పాపం ఇంత కష్టపడినా ఫలితం దక్కలేదు

తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు ఆయా హీరోలు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేసే దాఖలాలు తక్కువే. విజయ్, అజిత్, రజినీకాంత్ భూమి బద్దలైనా ఇక్కడికి రామంటారు. కానీ కొందరు మాత్రం ఒరిజినల్ వెర్షన్ కు ధీటుగా ఇక్కడా ఆడాలని కోరుకుని అదే పనిగా వచ్చి పబ్లిసిటీలో భాగమవుతారు. వాళ్ళలో శివ కార్తికేయన్ ఒకడు. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, మహావీరుడుతో తనకు టాలీవుడ్ లో డీసెంట్ మార్కెట్ ఏర్పడింది. ప్రిన్స్ ఫ్లాప్ అయినా మన దర్శకుడు అనుదీప్ తో చేయడంతోనే తన లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంత శ్రద్ధ పెడతాడు.

ఇంత చేసినా ఆయలాన్ అనువాదం మోక్షం దక్కించుకోవడం లేదు. గత నెల 26న కెప్టెన్ మిల్లర్ తో పాటు ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శివ కార్తికేయన్ స్వయంగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఓపిగ్గా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడమని ఆడియన్స్ ని అభ్యర్థించాడు. ఆన్ లైన్ బుకింగ్స్ కూడా పెట్టారు. తీరా చూస్తే ఏవో ఆర్థిక కారణాల వల్ల మార్నింగ్ షో పడ్డానికి కొన్ని గంటల ముందు రిలీజ్ ఆగిపోయింది. పది రోజులు దాటుతున్నా ఎలాంటి అప్డేట్ లేక ఆశలు సన్నగిల్లాయి.

ఈ ఫిబ్రవరి 16 నుంచి సన్ నెక్స్ట్ లో ఆయలాన్ ఓటిటి వర్షన్ వస్తుందని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. సన్ ఛానల్ అఫీషియల్ హ్యాండిల్స్ లో ప్రోమోలు వదులుతున్నారు. డేట్ లేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇక్కడ థియేటర్లకు రాకుండానే డిజిటల్ లో ఇస్తారా అంటే చూస్తుంటే అదే జరిగేలా ఉంది. గతంలో శివరాజ్ కుమార్ వేద ఇదే తరహా సమస్యను ఎదురుకుని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకేసారి థియేటర్, ఓటిటిలో ఒకేరోజు రిలీజయ్యింది. దాని వల్ల ఏం జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు. పాపం శివ కార్తికేయన్ ఇంత కష్టపడి తన సినిమాను ప్రమోట్ చేసుకుంటే ఇలా జరగడం ట్రాజెడీ.

This post was last modified on February 5, 2024 9:53 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago