‘ఈగ’ సినిమాలో విలన్ పాత్రధారి.. ఈగ దాడిని తప్పించుకునే క్రమంలో, దాన్ని చంపే ప్రయత్నంలో ఎన్నెన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడో తెలిసిందే. ఒకసారి ఈగ కారణంగా అతడి కారు బోల్తా పడి ప్రాణాల మీదికి వస్తుంది. ఇంకోసారి ఈగ ధాటికి రాత్రంతా నిద్రే లేక అవస్థ పడతాడు. మరో సందర్భంలో ఇంటినంతా ధ్వంసం చేసుకుంటాడు.
చివరికి ఇళ్లంతా తగలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. చివరికి ఈగ వల్ల ప్రాణాలు కూడా కోల్పోతాడు. ఐతే సినిమా కాబట్టి ఇలాంటి ఎగ్జాజరేషన్లు మామూలే. కానీ నిజ జీవితంలో ఒక ఈగను చంపడం కోసం ఓ వ్యక్తి తన ఇంటిలో కొంత భాగాన్ని ధ్వంసం చేసుకున్నాడు. అలాగే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయి. ఫ్రాన్స్‌లోని ఓ నగరంలో ఈ ఆశ్చర్యకర ఉదంతం చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీని గురించి బీబీసీ వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఈగను చంపడానికి ప్రయత్నించి తన ఇంటిలో కొంత భాగాన్ని తగలబెట్టుకున్నాడట. తన చుట్టూ తిరుగుతూ విసిగిస్తున్న ఈగను ఎలాగైనా చంపాలనుకున్న ఆ వ్యక్తి.. దోమలు, పురుగుల్ని చంపే ఎలక్ట్రిక్ బ్యాట్ పట్టుకుని వెంబడించాడట. అయితే అప్పటికే ఇంట్లో గ్యాస్ లీకవుతున్న విషయాన్ని ఆయన గమనించలేదు.
ఎలక్ట్రిక్ బ్యాట్ నుంచి వచ్చిన నిప్పురవ్వలకు గ్యాస్ తోడై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కిచెన్‌తో పాటు ఇంటి పైకప్పు కూడా ధ్వంసం అయింది. అదృష్టం కొద్దీ ఆ ముసలాయనకు ఏమీ కాలేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి గాయపడ్డట్లు తెలిసింది. ఇంతకీ ఈ విధ్వంసానికి కారణమైన ఈగ ఏమైందో ఏమో మరి. ఈ ఉదంతం తెలుసుకున్న మన జనాలకు మాత్రం ‘ఈగ’ సినిమానే గుర్తుకొస్తోంది.
This post was last modified on September 7, 2020 11:02 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…