ఎప్పుడో అమ్మమ్మల తాతయ్యల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎగబడి చూశారు కానీ ఇప్పటి టెక్నాలజీలో మాములు కలర్స్ లో తీస్తేనే ప్రేక్షకులను మెప్పించడం కష్టంగా మారిపోయింది. ఐమాక్స్, డాల్బీ విజన్, 8కె అంటూ రకరకాల మార్పులతో ఆడియన్స్ సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉన్న లార్జ్ స్క్రీన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటప్పుడు కేవలం బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో ఒక స్టార్ హీరో సినిమా చూడటం అంటే ఆ ఊహే వింతగా అనిపిస్తుంది. కానీ మమ్ముట్టి మాత్రం ఈ రిస్క్ కు సిద్దపడి ఛాలెంజ్ అంటున్నారు.
తెలుగుతో పాటు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో విడుదల కాబోతున్న భ్రమ యుగం పూర్తిగా నలుపు తెలుపు కలర్స్ లో ఫిబ్రవరి 15కి రెడీ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మళయాళమే అయినప్పటికీ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అందరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో రేవతి ప్రధాన పాత్రలో భూతకాలం అనే సింపుల్ హారర్ ఓటిటి మూవీతో శభాష్ అనిపించుకున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ భ్రమయుగం తీశాడు. ప్రత్యేకంగా బీజీఎమ్ సౌండ్ ట్రాక్ ని ఇటీవలే యూట్యూబ్ లో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ఇది సక్సెస్ అయితే మరికొందరు ఇదే బాట పట్టే అవకాశం లేకపోలేదు. 2023లో దర్శకుడు రాజ్ మాదిరాజు ఇదే తరహాలో గ్రే అనే సినిమా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. కానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం ఒక మైనస్ అయితే థ్రిల్లింగ్ కంటెంట్ లేకపోవడం ఇంకో దెబ్బ. కానీ భ్రమయుగంకి ఆ సమస్య లేదు. మమ్ముట్టి మొదటిసారి నటించిన కంప్లీట్ హారర్ మూవీ ఇది. ఆయన గెటప్ కూడా భయంకరంగా ఉంది. అసలు సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయట. హీరోయిన్, పాటలు, కమర్షియల్ మసాలా ఇవేవి లేని ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో.
This post was last modified on February 4, 2024 9:18 pm
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…