Movie News

భగవంత్ కేసరి రీమేక్ ఎవరి చేతికి

బాలకృష్ణ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా గత ఏడాది దసరా విజేతగా నిలిచిన భగవంత్ కేసరి రీమేక్ కోసం ఇతర భాషల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళ కన్నడలో డిమాండ్ అధికంగా ఉందని ఇన్ సైడ్ టాక్. రాజకీయ ప్రవేశానికి ముందు డివివి దానయ్య నిర్మించబోయే తన చివరి సినిమాకు ఈ కథ బాగుంటుందని విజయ్ అభిప్రాయపడ్డాడట. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమెను జీవితంలో కొత్త స్థాయికి తీసుకునే బాలయ్య పాత్ర విజయ్ కి విపరీతంగా నచ్చిందని, ఆ కారణంగానే కొన్ని మార్పులతో తన ఇమేజ్ కు తగ్గట్టు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట.

ఇంకా తుది నిర్ణయమైతే తీసుకోలేదని సమాచారం. రిలీజైన టైంలోనే దీని గురించి ప్రశంసిస్తూ అనిల్ రావిపూడి, బాలయ్యలకు ఫోన్ చేసి మాట్లాడాడనే వార్త చెన్నై వర్గాల్లో తిరిగింది. ఒకవేళ తాను వద్దనుకుంటే ఇదే ప్రతిపాదన రజనీకాంత్ దగ్గరకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడున్న బిజీలో ఆయన చేయడం డౌటే. కన్నడలో శివరాజ్ కుమార్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. అసలే తనకు  బాలకృష్ణ ఘాడమైన స్నేహం ఉంది. నిజంగా చేయాలనుకుంటే హక్కులు దక్కించుకోవడం క్షణాల్లో పని. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నందున నిర్ణయం వెలువడలేదు.

This post was last modified on February 3, 2024 10:09 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

27 mins ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

1 hour ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

3 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

4 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago