Movie News

గ్యాంగ్స్ అఫ్ గోదావరికి మళ్ళీ చిక్కులు

డిసెంబర్ లో తన సినిమా విడుదల కాకపోతే ప్రమోషన్లలో పాల్గొనబోనని శపథం చేసిన విశ్వక్ సేన్ ఆ తర్వాత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని చల్లబడ్డాడు. బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ని వేగంగా చేస్తున్నారు. స్పెషల్ సాంగ్ కోసం ఈషా రెబ్బని తీసుకుని తనకేదో సమస్య రావడంతో ఆ స్థానంలో హిందీ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్ ని తీసుకున్నారని లేటెస్ట్ అప్డేట్. మార్చుకున్న తేదీ ప్రకారం గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ కావాల్సిన డేట్ మార్చి 8. కానీ ఇప్పుడా టార్గెట్ ని చేరుకోవడం కష్టంగానే ఉందని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు చైతన్య కృష్ణ డే అండ్ నైట్ దీని పని మీదే ఉన్నారు.

ఇదింకా తేలకపోయినా ఇతర నిర్మాతలు ఆ డేట్ మీద కర్చీఫ్ లు వేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ దాన్ని లాక్ చేసుకుంది. బేబీ తెచ్చిన క్రేజ్ వల్ల బిజినెస్ బాగా జరుగుతుందనే అంచనాలో నిర్మాతలున్నారు. ఫిబ్రవరి 16 రావాల్సిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఒకవేళ మార్చి 1 సాధ్యపడకపోతే ఎనిమిదికి వెళ్లాలని సోనీ సంస్థ ఆలోచన చేస్తోంది. వీటి కన్నా ముందు గోపిచంద్ ‘భీమా’ని అఫీషియల్ గా ఆ తేదీకి ప్రకటించేశారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో క్రమంగా పోటీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ మారాల్సి వస్తే రెండు ఆప్షన్లు ఉంటాయి. మార్చి 15 లేదా 22 చెప్పుకోదగ్గ పోటీ లేదు. మళ్ళీ 29న ఇదే సితార బ్యానర్ టిల్లు స్క్వేర్ షెడ్యూల్ చేసి పెట్టారు. సో ఛాన్స్ ఉండదు. ఏప్రిల్ 5 విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని దింపేందుకు దిల్ రాజు ప్రణాళిక వేసుకుని ఉన్నారు. సోలో డేట్ అయితే బాగుంటుందని ఎదురు చూసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి ఇవన్నీ చికాకు పెట్టే పరిణామాలే. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉండి ఇప్పుడు రిలీజ్ రెడీ అయిన విశ్వక్ సేన్ మరో సినిమా గామి ప్రమోషన్లు ఊపందుకోవడం చూస్తే గ్యాంగ్స్ మీద అనుమానం ఇంకా పెరుగుతోంది.

This post was last modified on February 1, 2024 7:26 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

15 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

42 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

52 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

5 hours ago