Movie News

బ్యాండు సౌండ్ మీదే అందరి దృష్టి

ఒక చిన్న సినిమాకు హైప్ తేవడం నిర్మాణం కన్నా పెద్ద సవాల్ గా మారిపోయిన పరిస్థితులివి. అలాంటిది అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మీద ఈ మాత్రం బజ్ ఉందంటే పబ్లిసిటీ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్దే కారణం. దానికి తోడు కంటెంట్ మీద నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఇవాళ రాత్రే ప్రీమియర్లకు సిద్ధ పడటం కాన్ఫిడెన్స్ ని చూపిస్తోంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ కు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. రాత్రి టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగేసరికి రిలీజ్ రోజు సాయంత్రం నుంచే టికెట్లు దొరకలేదు. నిర్మాతలు వేరైనప్పటికీ దీనికీ అదే స్పందన ఆశిస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకున్న పెద్ద సానుకూలాంశం బాక్సాఫీస్ గ్యాప్. హనుమాన్ ని అందరూ చూసేశారు. మిగిలిన మూడు సంక్రాంతి సినిమాలు ఓటిటిలకు రెడీ అవుతున్నాయి. ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకుల దగ్గర ఆప్షన్ లేదు. రెండు వారాలుగా థియేటర్లకు సరైన ఫీడింగ్ లేదు. గత వారం కెప్టెన్ మిల్లర్ నిరాశపరిస్తే ఫైటర్ కూడా సోసోగానే వెళ్తోంది. సో మూవీ లవర్స్ ఎదురు చూపులు భారీగా ఉన్నాయి. రేపు కౌంట్ పరంగా ఎనిమిదికి పైగా రిలీజులున్నా సుహాస్ మీద ఉన్నంత ఫోకస్ మిగిలినవాటికి రావడం లేదు. అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడం కీలకం.

రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత లేవు. రాత్రి వచ్చే టాకే వసూళ్లకు కీలకం కానుంది. ఎక్కువ సంఖ్యలో షోలు వేస్తున్నారు కాబట్టి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా స్పష్టంగానే వస్తుంది. సుహాస్ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇలాంటి విడుదల దక్కడం మంచిదే. విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా షో చూసి మరీ మెచ్చుకున్నాడు. అడవి శేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి డాన్సు కూడా చేశాడు. ఇండస్ట్రీలో మంచి మద్దతు కూడగట్టుకున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి అదే సపోర్ట్ ఆడియన్స్ నుంచి వస్తే హిట్టు పడ్డట్టే. ఇవాళ అర్ధరాత్రి దాటడం ఆలస్యం మ్యాటరేంటో తెలిసిపోతుంది.

This post was last modified on February 1, 2024 10:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

4 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

6 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

7 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

8 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

8 hours ago