ఒకే ఒక జీవితం ముందు వరస ఫ్లాపులతో సతమతమైన శర్వానంద్ కు ఆ సినిమా విజయం ఇచ్చిన ఊరట అంతా ఇంతా కాదు. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదారు పరాజయాలు పలకరిస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. పెళ్ళైనప్పటి నుంచి కొంత స్పీడ్ తగ్గించిన శర్వాకు ఇప్పుడు సరైన కాంబినేషన్లు పడుతున్నాయి. మంచి డైరెక్టర్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. శ్రీరాం ఆదిత్యతో కృతి శెట్టి హీరోయిన్ గా జరుగుతున్న మూవీ ఆల్రెడీ ముగింపు దశలో ఉంది. బాబ్ అనే టైటిల్ లీకయ్యింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఆ లాంఛనం చేయబోతున్నారు.
దీని తర్వాత సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్, సాక్షి వైద్యలను జోడిగా ఫిక్స్ చేసుకున్నారు. ఇది కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే మ్యారీడ్ బ్యాచిలర్ కథగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సమాంతరంగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. లూజర్ వెబ్ సిరీస్ తో మెప్పు పొందిన అభిలాష్ కు ఎస్ చెప్పాడు. మాళవిక నాయర్ జోడిగా నటించనుండగా జిబ్రాన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. త్వరలోనే స్టార్ట్ కానుంది.
పక్కా ప్లానింగ్ తో దర్శకులను సింక్ చేసుకుంటున్న శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ని కొనసాగించే ఉద్దేశంతో కొంత టైం పడుతున్నా కాంబోలు సెట్ చేసుకుంటున్నాడు, బాబ్ రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందనే కారణాలు గుట్టుగా ఉన్నాయి కానీ కీలకమైన ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసినట్టు యూనిట్ టాక్. 2023లో శర్వానంద్ నుంచి ఒక్క రిలీజూ లేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా రెండు ఉండేలా దర్శక నిర్మాతలకు ముందే సూచనలు ఇచ్చాడట శర్వా. ఇవి కాకుండా మరో రెండు స్టోరీ డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. అభిలాష్ తో చేయబోయే సినిమా ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ లో ఉంటుందట.
This post was last modified on January 31, 2024 10:05 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…