తెలుగులో రెండు వరస బ్లాక్ బస్టర్లతో మృణాల్ ఠాకూర్ జాతకమే మారిపోయింది. సీతారామం, హాయ్ నాన్న విజయాలు టాలీవుడ్ ఎంట్రిని గ్రాండ్ గా మార్చేశాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం తనలో బలంగా ఉంది. ఆఫర్లు వస్తున్నా సరే ఆచితూచి అడుగులు వేస్తోంది. చిరంజీవి విశ్వంభరలో అవకాశం వచ్చిందన్నారు కానీ ఇంకా ఓకే చెప్పింది లేనిది తెలియలేదు. పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా కొందరు అభిమానులు తన పాత సినిమాలు తవ్వే పనిలో పడ్డారు. వాటిలో నమ్మశక్యం కాని విధంగా మృణాల్ ని చూసి షాక్ తింటున్నారు.
అందులో ఒకటి లవ్ సోనియా. ఇది 2018లో రిలీజయ్యింది. కానీ షూటింగ్ జరుపుకుంది మాత్రం 2012 నుంచి. రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ చివరికి మోక్షం దక్కించుకుంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని చూస్తే ఠక్కున గుర్తుపట్టడం కష్టం. అంత లేతగా ఉంది మరి. కుటుంబ పరిస్థితుల వల్ల దారుణంగా మోసపోయి దగాపడిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళ కథ ఇది. అధిక భాగం ముంబై రెడ్ లైట్ ఏరియాలో జరుగుతుంది. దానికి తగ్గట్టే మృణాల్ షాకింగ్ లుక్స్ ఇందులో చాలా ఉంటాయి.
కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్ లోనూ నటించిన మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో ఆశించిన బ్రేక్ ఇప్పటిదాకా దక్కలేదు. దానికి కారణం స్టార్ హీరోల సరసన జోడి కట్టలేకపోవడమే. ఎందుకిలా అని అడిగితే దాని కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పిన మృణాల్ ఫ్యామిలీ స్టార్ రిలీజయ్యాక తెలుగు సినిమాలు ఎక్కువ చేస్తానని చెబుతోంది. హాయ్ నాన్న తర్వాత మరింత ఫాలోయింగ్ పెరిగిందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం తొందరపడి వచ్చినవన్నీ ఒప్పుకోవడం లేదని అంటోంది. ప్రైమ్ లో ఉన్న లవ్ సోనియాని ఫ్యాన్స్ చూసే పనిలో పడ్డారు.
This post was last modified on January 31, 2024 6:01 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…