క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ ఫేమ్ వాసుకి ప్రధాన పాత్రల్లో రూపొందిన 90స్ మిడిల్ క్లాస్ ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఒకే బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. దర్శకుడు ఆదిత్య హాసన్ కు ఇదే డెబ్యూ అయినప్పటికీ అనుభవమున్న వాడిలా మధ్య తరగతి ఎమోషన్స్ ని చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. టేకింగ్ పరంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రెజెంట్ చేసిన తీరు ఆ బలహీనతలను కవర్ చేసింది. ముఖ్యంగా పిల్లలుగా నటించిన మౌళి, రోహన్ రాయ్ లకు చాలా పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం సెకండ్ సీజన్ కు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఆదిత్య హాసన్ ఏకంగా డబుల్ జాక్ పాట్ కొట్టేశాడు. రెండు పెద్ద బ్యానర్ల నుంచి సినిమా అవకాశాలు పట్టేశాడు. నితిన్ హీరోగా తన స్వంత బ్యానర్ శ్రేష్ట్ మీద ఒక మూవీ చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. ప్రస్తుతం స్టోరీ ఓకే అయినట్టు తెలిసింది. రెండోది సితార ఎంటర్ టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఒక ప్రాజెక్టు కోసం లాక్ చేసుకున్నారట. ఇంకా హీరో హీరోయిన్ తదితర వివరాలేం తెలియవు కానీ కథ ఫైనల్ వెర్షన్ సిద్ధమయ్యాక దానికి అనుగుణంగా ఎవరు సూటవుతారో వాళ్ళను తీసుకొస్తానని ఆదిత్యకు హామీ దొరికినట్టు వినికిడి.
ఇంతకన్నా డెబ్యూ డైరెక్టర్ కి కావాల్సింది ఏముంటుంది. మాములుగా హిందీ వెబ్ సిరీస్ లతో హిట్లు కొట్టి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇలా తెలుగులో జరగడం చాలా అరుదు. అందుకే ఆదిత్య హాసన్ చేతిరేఖ బాగుంది. భారీతనం లేకుండా సింపుల్ కథలతోనూ అందమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను మెప్పిస్తే అవకాశాలు వచ్చి మరీ తలుపు తడతాయని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏముంటుంది. 90స్ మిడిల్ క్లాస్ పుణ్యమాని ఓటిటి రంగంలో ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకుంటున్న ఈటీవీ విన్ కి పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లు వచ్చి పడ్డారు. కంటెంట్ మహత్యమిది.
This post was last modified on January 31, 2024 5:29 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…