జస్ట్ నిన్నే పుష్ప 2 ది రూల్ ఇంకో రెండు వందల రోజుల్లో రిలీజ్ అవుతుందని టీమ్ అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. అయినా సరే ఇండస్ట్రీ జనాలకు నమ్మకం కుదరడం లేదు. ఆగస్ట్ 15ని తీసుకునేందుకు పోటీ పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి తప్పుకున్న దేవర ఇండిపెండెన్స్ డేకి వస్తుందని ఒకరు, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాని పక్షంలో నాని సరిపోదా శనివారం రావడం పక్కాని మరొకరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఓజి డేట్ సెప్టెంబర్ 27 అని బయటికి వచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ డివివి ఇంకా ప్రకటనే ఇవ్వలేదు.
అందరూ పుష్ప 2 రాదని ఇంత బలంగా ఫిక్స్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కీలక పాత్ర చేసిన జగదీశ్ అరెస్ట్ కావడంతో ఇంకా లేట్ అవుతుందని ఓ ప్రచారం జరుగుతోంది. నిజానికతను బెయిల్ మీద బయటికి వచ్చాడనేది యూనిట్ అనధికారికంగా చెబుతున్న మాట. ఫాహద్ ఫాసిల్ చాలా రోజులుగా పుష్ప 2లో జాయిన్ కావడం లేదు. తన భాగం దర్శకుడు సుకుమార్ పూర్తి చేశాడో లేదో తెలియదు. రష్మిక మందన్న పుష్ప 2తో పాటు ఇతర షూటింగుల్లో బిజీగా కనిపిస్తోంది. అనసూయ, సునీల్ తదితరుల జాడలేదు.
ఈ గాసిప్పుల సంగతి ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 వదలకూడదనే పంతంతో ఉన్నారు బన్నీ, సుకుమార్. కానీ పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దేవీశ్రీ ప్రసాద్ తన వరకు పాటల కంపోజింగ్ పూర్తి చేశాడు కానీ రీ రికార్డింగ్ కోసం కనీసం ఒక నెల ఇవ్వాలి. కొత్త ఏడాదిలో ఆల్రెడీ 30 రోజులు గడిచిపోయాయి. చేతిలో ఉన్న ఆరు నెలల్లో ఫస్ట్ కాపీని సుకుమార్ సిద్ధం చేయలేడనే ధీమా ఇతర నిర్మాతల్లో కనిపిస్తోంది. వీటికి చెక్ పడాలంటే హీరో దర్శకుడు ఎవరో ఒకరు బలంగా ఒక వీడియో మెసేజ్ లేదా ట్వీట్ పెట్టాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రహసనం ఇలాగే ఉంటుంది.
This post was last modified on January 30, 2024 6:32 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…