తెలుగు సినిమాలకు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతే. సంవత్సరం మొత్తంలో ఒక్క వీకెండ్లో ఎక్కువ భారీ చిత్రాలు రిలీజయ్యేది ఆ పండక్కే. సంక్రాంతి సమయంలో యూత్ మాత్రమే కాక ఫ్యామిలీస్ కూడా సినిమాలు చూడడాన్ని ఎంతో ఇష్టపడతాయి. కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకే ఆ సమయంలో మిగతా రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి 30 శాతం దాకా అదనపు వసూళ్లు తెచ్చుకుంటుందని అంచనా. అందుకే సంక్రాంతికి వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతుంటాయి.
ఐతే దశాబ్దాల సంక్రాంతి సినిమాల చరిత్రలో ఎప్పుడూ స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాలదే ఆధిపత్యం. వాటి పేరిటే రికార్డులన్నీ ఉంటాయి. కానీ ఈ ఏడాది హనుమాన్ అనే మిడ్ రేంజ్ మూవీ అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసి సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం.
అప్ కమింగ్ హీరో తేజ సజ్జను పెట్టి దర్శకుడిగా మూడు చిత్రాల అనుభవం ఉన్న ప్రశాంత్ వర్మ పరిమిత బడ్జెట్లో తీసిన ‘హనుమాన్’ అన్ని అంచనాలను మించిపోయి ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో మూడేళ్ల కిందట ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నెలకొల్పిన రికార్డు బద్దలైపోయింది. ఫుల్ రన్ అయ్యేసరికి ఏరియాల వారీగా కూడా హనుమాన్ అన్ని రికార్డులనూ తుడిచిపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ చిత్రాలకు పేరుపడ్డ సంక్రాంతి సీజన్లో హనుమాన్ లాంటి చిత్రం చరిత్రను తిరగరాసే విజయం అందుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఫుల్ రన్లో ఈ చిత్రం ఇంకో వంద కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఈ రికార్డులు బద్దలు కావడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on January 30, 2024 6:27 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…