పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తీన్‌మార్ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. అందులో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే హీరోయిన్ కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయింది. ఐతే ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు తెలుగులో అంతగా కలిసి రాలేదు.
తర్వాత తెలుగులో ఆమె నటించిన మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ లాంటి సినిమాలేవీ కూడా సరిగా ఆడలేదు. మరోవైపు కన్నడలోనూ ఆమెకు బ్రేక్ లభించలేదు. తమిళంలో కూడా ఒకట్రెండు సినిమాలు చేసి మాయమైంది ఈ కన్నడ భామ. చివరగా ఆమె ప్రస్థానం బాలీవుడ్‌కు మారింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఓ మోస్తరు ఫలితాలందుకుంది.
సౌత్‌లో ఉన్నంత వరకు ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేస్తూ, అలాంటి అప్పీయరెన్స్, ఇమేజ్‌తోనే కొనసాగిన కృతి.. బాలీవుడ్‌కు వెళ్లాక చాలా మారింది. అక్కడి సినిమాలకు తగ్గట్లుగా గ్లామర్ టచ్ అద్దుకుంది. సినిమాల్లో హాట్ హాట్ సీన్లూ చేసింది. అంతే కాక ఒక బాయ్‌ఫ్రెండ్‌తోనూ రిలేషన్ షిప్ నడిపింది. ఆ వ్యక్తే.. పులకిత్ సామ్రాట్.
టీవీ సీరియల్స్‌తో ఫేమస్ అయి.. ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేసిన పులకిత్‌తో ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో కలిసి నటించింది కృతి. ఆ టైంలోనే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైనట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న పులకిత్‌తో కృతిది సీరియస్ రిలేషన్‌షిప్పా కాదా అనే విషయాలు సందేహాలు కొనసాగాయి. ఐతే ఆరేళ్ల పాటు తమ బంధాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట.. ఎట్టకేలకు బయటపడింది. ఎంగేజ్మెంట్ చేసుకోవడం ద్వారా తమ బంధాన్ని అధికారికం చేసింది.
This post was last modified on January 30, 2024 6:18 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…