Movie News

హనుమాన్.. మాస్టర్ ప్లాన్

హీరోగా ఎలాంటి ఇమేజ్ తేజ సజ్జ అనే కుర్రాడిని పెట్టి మూడు సినిమాల అనుభవం ఉన్న ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం, బద్దలు కొడుతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట సంక్రాంతికి ఈ సినిమాను ప్రదర్శించని థియేటర్లు.. ఆ తర్వాత ఏరి కోరి దాన్నే ఆడించాయి. మూడో వీకెండ్లో కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది ఈ చిత్రం. ఒక భారీ ఈవెంట్ ఫిలిం స్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూనే.. టికెట్ ధరలు తక్కువ ఉండటం ‘హనుమాన్’కు బాగా ప్లస్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లలో 150-175 రేటుతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.. మల్టీప్లెక్సుల్లో రూ.250-295 మధ్య రేటు పెట్టారు. ఈ ధరలతో ఒక విజువల్ వండర్‌ను చూడటం పట్ల ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ. యుఎస్‌లో సైతం ధరలు అందుబాటులో ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చింది. కంటెంట్ ఉన్న సినిమాకు అందుబాటులో టికెట్ల ధరలు ఉంటే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చెప్పడానికి ‘హనుమాన్’ చిత్రమే ఉదాహరణ.

ఐతే ‘హనుమాన్’ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు సినిమా లాంగ్ రన్ పెంచడానికి, ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడానికి మరో మాస్టర్ ప్లాన్‌తో రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమాను ఇంకా తక్కువ ధరలతో ప్రేక్షకులకు చూపించబోతున్నారట. నైజాం ఏరియాలో కొన్ని సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్ ఉంది. దాన్ని రూ.150కి తగ్గిస్తారట. అలాగే అన్ని మల్టీప్లెక్సుల్లో కామన్ రేటు రూ.200కు తగ్గిస్తారట. నాలుగో వారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.

ఇంకొన్ని రోజులు గడిచాక సింగిల్ స్క్రీన్ల ధరలను అవకాశమున్న చోట రూ.112కు తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నారట. దీని వల్ల ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు ఎక్కువ ఉండడం వల్ల లాభం పెరుగుతుంది. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి చిత్రాలకు ఇలాంటి ఆఫర్లు బాగా కలిసొచ్చాయి. మొత్తానికి హనుమాన్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులకు చూపించి లాభాలు మరింత పెంచుకోవడానికి టీం మాస్టర్ ప్లానే వేసినట్లు కనిపిస్తోంది.

This post was last modified on January 30, 2024 3:48 pm

Share

Recent Posts

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

14 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

6 hours ago