రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ని సెప్టెంబర్ లో విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ చెబితే తప్ప నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండటంతో అనౌన్స్ చేయలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సెప్టెంబర్ 27 వస్తే అక్టోబర్ మొదటి వారం గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా దాకా వరసగా సెలవులు ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని లాక్ చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈలోగా పవన్ కళ్యాణ్ ఓజి షాక్ ఇస్తూ అదే సెప్టెంబర్ 27 విడుదలకు రంగం సిద్ధం చేసుకోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది.
ఇది ఊహించని పరిణామం. ఎందుకంటే రాబోయే ఎన్నికల దృష్ట్యా పవన్ కళ్యాణ్ అంత సులభంగా డేట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న సినిమాలన్నీ ఆలస్యమవుతాయనే అందరూ అనుకున్నారు. కానీ ఇరవై రోజుల కాల్ షీట్లు ఇస్తే చాలు పూర్తి చేసేలా దర్శకుడు సుజిత్ ప్లాన్ చేసుకోవడంతో పవన్ సరే అన్నారట. ఎప్పటి నుంచి అనేది మాత్రం చెప్పలేదు. ఈలోగా డేట్ ని రిజ్వర్వ్ చేసుకుంటే ముందు రాబోయే తలనెప్పి తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో ఓజి కోసం సెప్టెంబర్ 27 మీద కర్చీఫ్ వేసేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు చిక్కొచ్చి పడింది.
గేమ్ చేంజర్ ఈ ఏడాది రాకపోతే సంక్రాంతికి సాధ్యం కాదు. ఎందుకంటే చిరంజీవి విశ్వంభర ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంది. పోనీ ఈ ఆగస్ట్ ఏమైనా చూద్దామా అంటే పుష్ప 2 ది రూల్ తగ్గేదేలే వస్తానని పట్టుదలతో ఉంది. ఇంకా దేవర సంగతి తేలలేదు. కొరటాల శివ బృందం వీలైనంత త్వరగా కొత్త డేట్ పట్టేసుకోవాలని తెగ ఆలోచిస్తోంది. ఇండియన్ 2ని కూడా ఇంకా డిసైడ్ కాలేదు. బోలెడు సందిగ్దతల మధ్య ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. ఒక్క సలార్ మార్పుకే మొన్న సెప్టెంబర్ లో అంత రచ్చ జరిగింది. ఇప్పుడలాంటి ఉదంతాలు వరసగా వచ్చేలా ఉన్నాయి.
This post was last modified on January 30, 2024 3:17 pm
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…