నిన్నటితో హరిహర వీరమల్లు ప్రారంభోత్సవం జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇవాళ అయిదో ఏడు ప్రారంభం. అయినా ఇప్పటిదాకా విడుదల తేదీ ఎప్పుడో ఖరారుగా చెప్పలేని పరిస్థితి తలుచుకుని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా షూటింగ్ మొదలైన కొత్తలో ఎంత హైప్ వచ్చిందో వర్ణించడం కష్టం. పవన్ పుట్టినరోజుకి రిలీజ్ చేసిన టీజర్ ఒక్కసారిగా అంచనాలను అమాంతం పెంచేసింది. కట్ చేస్తే మధ్యలో వాయిదాలు, కరోనాలు, ఇతర కొత్త సినిమాల ప్రమేయాలు ఇలా కాలం కర్పూరమయ్యింది.
2024లో విడుదల చేసే ఛాన్స్ లేదు. ఎన్నికలు ఏప్రిల్ లో జరుగుతాయి. ఆ వెంటనే మొదటి ప్రాధాన్యంగా ఓజికి డేట్స్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది. ఈ రెండు అయ్యేలోగా 2025 వచ్చేస్తుంది. వీరమల్లు దర్శకుడు క్రిష్ వచ్చే నెల కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నట్టు టాక్ ఉంది. అంటే మళ్ళీ పవన్ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి ఆలోగా ఇంకా సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకున్నాడట. ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ లెక్కన ఎంత లేట్ గా మొదలుపెట్టినా హరిహరవీరమల్లు 2026లో వచ్చేలా ఉంది. అంటే ఆరేళ్ళ కాలం అవుతుందన్న మాట. ఇంత సుదీర్ఘంగా సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఇదొక్కటే అవుతుంది. చిరంజీవికి ఇలాంటి జ్ఞాపకం అంజి రూపంలో ఉంది. నిర్మాత ఏఏం రత్నం మాత్రం ఎన్నికలు కాగానే ముందుకెళ్తుందనే నమ్మకాన్ని తరచు వ్యక్తం చేస్తున్నారు కానీ వాతావరణం దానికి అనుకూలంగా లేదు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు
This post was last modified on January 30, 2024 12:45 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…