Movie News

ఫిబ్రవరి 2 – చిన్న సినిమాల యుద్ధం

సంక్రాంతి సందడి అయ్యాక బాక్సాఫీస్ కు పదిహేను రోజుల గ్యాప్ వచ్చేసింది. రిపబ్లిక్ డేకి రిలీజైన వాటిలో కెప్టెన్ మిల్లర్ నిరాశ పరచగా, ఆయలాన్ చివరి నిమిషంలో షోలు రద్దయి ఉన్న ఆసక్తిని తగ్గించింది. ఏవో లీగల్ ఇష్యూస్ అన్నారు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఈ శుక్రవారం ఫిబ్రవరి 2 ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది చిన్న సినిమాలు నువ్వా నేనా అంటూ యుద్ధానికి సిద్ధ పడుతున్నాయి. బజ్ ఉన్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుహాస్ హీరోగా చేసిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ గురించి. ట్రైలర్ వచ్చాక దీని మీద ఆడియన్స్ లో మెల్లగా ఆసక్తి పెరిగింది.

క్రమం తప్పకుండ ప్రమోషన్లతో పాటు ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడానికి సిద్ధపడి కంటెంట్ మీద నమ్మకాన్ని స్పష్టం చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ‘బూట్ కట్ బాలరాజు’ కామెడీని నమ్ముకుని వస్తోంది. ప్రమోషన్లకు పైసల్ లేవని, మంచి సినిమాని ఆదరించమని హీరో పబ్లిక్ గా చెప్పడం గమనార్హం. హాస్యాన్నే నమ్ముకున్న మరో మూవీ ‘కిస్మత్’లో సపోర్టింగ్ ఆర్టిస్టులే హీరోగా నటించారు. తమను తక్కువంచనా వేయొద్దని ‘గేమ్ ఆన్’ టీమ్ చెబుతోంది. ఇవి కాకుండా హ్యాపీ ఎండింగ్, ధీర, మెకానిక్, ఉర్విలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నాయి.

కౌంట్ అయితే పెద్దగానే ఉంది కానీ ప్రేక్షకులను ఫైనల్ గా మెప్పించాల్సింది క్వాలిటీనే. కాకపోతే మరీ ఇంత తీవ్రమైన పోటీలో ఎంత చిన్న సినిమాలైనా సరే ఈ స్థాయిలో పోటీ పడటం వల్ల కలిగే ప్రయోజనం అంతు చిక్కడం లేదు. ఆపై వారం రవితేజ ఈగల్, యాత్ర 2, రజినీకాంత్ లాల్ సలామ్ లు వస్తాయి. హనుమాన్ ఎలాగూ కొనసాగుతోంది. సో పైన చెప్పిన ఎనిమిది సినిమాలకు టాక్ కీలక పాత్ర పోషించనుంది. వీటిలో జనాలకు నిజంగా ఏవి రీచ్ అవుతాయో, ఏవి మొక్కుబడి రిలీజ్ గా మిగిలిపోతాయో చూడాలి. థియేటర్ల సమస్య లేదు. డిమాండ్ కు తగ్గట్టు వాటికి సరిపడా దొరుకుతున్నాయి.

This post was last modified on January 30, 2024 12:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

డ్రాగన్ టైటిల్ వెనుక ఊహించని మెలిక

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్…

46 mins ago

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

2 hours ago

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

3 hours ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

5 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

6 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

6 hours ago