Movie News

స్టార్ హీరోలూ.. హనుమాన్ ఘనత చూశారా?

అమెరికాలో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండే వేరు. ఒకప్పుడు అక్కడ హిందీ సినిమాలు మాత్రమే రిలీజయ్యేవి. కానీ తర్వాతి కాలంలో తెలుగు సినిమాల హవా మొదలైంది. తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సినిమాల పట్ల చూపించే అభిమానమే వేరు. యుఎస్‌లో తెలుగు ఎన్నారైల సంఖ్య పెరిగిపోవడంతో అందుకు తగ్గట్లే మన సినిమాల హంగామా కూడా పెరిగింది. టికెట్ల ధరలు ఎంత పెట్టినా.. షోలు ఎంత దూరంలో ఉన్నా మన వాళ్లు రాజీ పడరు. ఈ డిమాండ్ చూసే ప్రిమియర్ షోలను భారీ స్థాయిలో ప్లాన్ చేయడం, భారీ రేట్లు పెట్టడం చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు.

ప్రిమియర్స్ తర్వాత నార్మల్ షోలకు కూడా హిందీ చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమాల రేట్లే ఎక్కువ ఉంటాయి. మన సినిమాలు అక్కడ చాలా వేగంగా మిలియన్ల కొద్దీ వసూళ్లు రాబట్టడానికి ఇదే కారణం. ఐతే రేట్లు మరీ పెంచేయడం వల్ల ప్రతికూల ప్రభావం కూడా పడుతున్న మాట వాస్తవం. దాని వల్ల ఆక్యుపెన్సీలు, లాంగ్ రన్ తగ్గి వసూళ్లు అనుకున్నంత స్థాయిలో ఉండట్లేదు.

ఇలాంటి తరుణంలో హనుమాన్ సినిమా యుఎస్‌లో అద్భుతం చేసింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు మరీ డిమాండ్ ఏమీ లేకపోవడం, సంక్రాంతికి గుంటూరు కారం లాంటి భారీ చిత్రం ఉండడంతో ‘హనుమాన్’కు 12 డాలర్ల నార్మల్ రేటు పెట్టారు. కాగా హనుమాన్‌కు మంచి టాక్ రావడం, గుంటూరు కారం అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో యుఎస్ ఆడియన్స్ వెంటనే అటు మళ్లారు. దీంతో యుఎస్‌లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో హనుమాన్ వసూళ్లు పెరిగిపోయాయి. మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ఆ చిత్రం ఇప్పుడు ఏకంగా 5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.

బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, సలార్ లాంటి భారీ చిత్రాల తర్వాత ఈ ఘనత అందుకున్న చిత్రం ‘హనుమాన్’యే. మిగతా చిత్రాల్లో వేటికీ టికెట్ ధర 25 డాలర్లకు తక్కువ లేదు. కానీ హనుమాన్ 12 డాలర్ల నార్మల్ రేటుతో ఈ ఘనత అందుకుని సంచలనం సృష్టించింది. కంటెంట్ బలంగా ఉండి, రేట్లు తక్కువ ఉండడం హనుమాన్‌కు పెద్ద ప్లస్ అయింది. ఇది పెద్ద సినిమాలు తీసేవాళ్లందరూ చూసి నేర్చుకోవాల్సిన పాఠం.

This post was last modified on January 29, 2024 6:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago