టాలీవుడ్ చరిత్రలో కొన్నేళ్ల పాటు చెప్పుకునే సక్సెస్ అంటే హనుమాన్ చిత్రానిదే. చిన్న సినిమాగా మొదలై ఎవ్వరు ఊహించని పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది ఆ చిత్రం. సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ చిత్రం గుంటూరు కారంని కూడా వెనక్కి నెట్టి ఆ సినిమా మెగా బ్లాక్ బస్టర్ గా అవతరించింది. విడుదల రెండు వారాలు దాటినా హనుమాన్ జోరు ఇంకా తగ్గలేదు. మూడో వీకెండ్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది.
అన్ని ఏరియాల్లోనూ మిడ్ రేంజ్ సినిమాల్లో కొత్త రికార్డులు నెలకొల్పుతూ సాగుతోంది హనుమాన్. తాజాగా హనుమాన్ ఒక గొప్ప ఘనతను అందుకుంది. ఈ సినిమా ఫుట్ ఫాల్స్ కోటి మార్కును అందుకున్నాయి.
హనుమాన్ సినిమా రేంజికి కోటి మంది థియేటర్ కు వెళ్లి సినిమా చూశారంటే చాలా పెద్ద విషయమే. స్టార్ కాస్ట్ లేకుండా మీడియం బడ్జెట్లో సినిమాకు.. ఈ స్థాయిలో ఫుట్ ఫాల్స్ రావడం అసాధారణ ఘనతే. అయితే హనుమాన్ రన్ ఇంకా అయిపోలేదు.
ఇంకో రెండు వారాలు బాగా ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. కాబట్టి సినిమా ఫుల్ రన్ అయ్యేసరికి ఇంకో 50 లక్షల మందిని థియేటర్లకు రప్పించినా ఆశ్చర్యం లేదు. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు 300 కోట్ల మార్కుకు చేరువగా ఉండడం విశేషం. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించారు.
This post was last modified on January 28, 2024 9:35 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…