తెరమీద అఘోరా పాత్ర చేయడం చాలా రిస్కు. కమర్షియల్ గా మాస్ నుంచి మద్దతు ఉండదు. గతంలో ఈ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న హీరోలు లేకపోలేదు. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం రాజేంద్ర ప్రసాద్ కాష్మోరాలో అద్భుత నటన ప్రదర్శించినా జనం ఆదరించలేదు. చిరంజీవి కాసేపు శ్రీమంజునాథలో గెటప్ వేస్తే నటనకు మురిసిన ఆడియన్స్ కలెక్షన్లు ఇవ్వలేదు. నేనే దేవుణ్ణిలో ఆర్య పెర్ఫార్మన్స్ ఇప్పటికీ బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ బాక్సాఫీస్ లెక్కల్లో దాన్ని ఫ్లాప్ గానే చూస్తారు. ఈ ట్రెండ్ ని బాలకృష్ణ సమూలంగా బ్రేక్ చేసి అఖండతో బ్లాక్ బస్టర్ అందుకోవడం చూశాం.
ఇప్పుడదే దారిలో విశ్వక్ సేన్ వస్తున్నాడు. తను అఘోరాగా నటించిన గామి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది సుమారు అయిదేళ్లకు పైగా నిర్మాణంలో ఉండి రిలీజ్ కు రెడీ అవుతోంది. సహజమైన లొకేషన్లలో, ప్రతి ఒక్కటి న్యాచురల్ గా ఉండాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో మంచు కురిసే ఎపిసోడ్ల కోసం ఏకంగా ఏడాది పాటు బ్రేక్ ఇచ్చారట. అలాంటి పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడితే ఆలస్యం అవుతుంది. విద్యాధర్ కగిత దర్శకత్వంలో రూపొందిన ఈ స్పిరిచువల్ థ్రిల్లర్ లో షాకింగ్ అంశాలు చాలా ఉంటాయట. సమర్పణ బాధ్యతను యువి క్రియేషన్స్ తీసుకుంది.
మార్చి 8 గ్యాంగ్స్ అఫ్ గోదావరి వస్తుందా రాదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో గామిని ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఇంకా టైం ఉంది కాబట్టి పబ్లిసిటీని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఆడియన్స్ కి రీచ్ కావొచ్చు. ఒకవేళ గ్యాంగ్స్ కనక ఒరిజినల్ డేట్ కి కట్టుబడితే గామిని వేసవిలో చూసుకోవచ్చు. మీడియం రేంజ్ హీరోల్లో ఇంత సుదీర్ఘమైన షూటింగ్ జరుపుకున్న సినిమా గామినే. విశ్వక్ సేన్ దీని కోసం చాలా కష్టపడ్డానని, తెరమీద అవుట్ ఫుట్ చూస్తే షాక్ అవ్వడం ఖాయమని చెబుతున్నాడు. చూస్తుంటే కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఇవ్వబోతున్నారు కాబోలు.
This post was last modified on January 28, 2024 9:23 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…