ఈ రోజుల్లో ఓ సినిమా లో బజ్‌తో రిలీజై.. డివైడ్ టాక్ తెచ్చుకుని.. తొలి రోజు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవంటే.. ఇక ఆ చిత్రం పైకి లేవడం కష్టం. కలెక్షన్లు అంతకంతకూ తగ్గడమే తప్ప.. పెరగడం ఉండదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ ఆరంభ తడబాటును అధిగమించి బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడతాయి. హృతిక్ రోషన్ కొత్త చిత్రం ఫైటర్ ఆ కోవకే చెందేలా కనిపిస్తోంది. బాలీవుడ్లో ఈ తరహా యాక్షన్ థ్రిల్లర్ల డోస్ ఎక్కువైపోవడం.. కథలు కూడా ఒకే రకంగా ఉంటుండడం వల్ల ‘ఫైటర్’కు రిలీజ్ ముంగిట హైప్ రాలేదు.
ట్రైలర్ రొటీన్‌గా, యావరేజ్‌గా అనిపించింది. దీంతో హృతిక్ రోషన్-సిద్దార్థ్ ఆనంద్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కినప్పటికీ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా కనిపించాయి. దీనికి తోడు ఫైటర్‌కు రివ్యూలు చాలా వరకు యావరేజ్‌గానే వచ్చాయి. ఆ ప్రభావం తొలి రోజు వసూళ్ల మీద పడింది.
ఇండియాలో ఫైటర్ డే-1 వసూళ్లు రూ.24 కోట్లకు పరిమితం అయ్యాయి. గత ఏడాది షారుఖ్-సిద్దార్థ్ ఆనంద్‌ల పఠాన్‌కు ఇండియాలో తొలి రోజు 50 కోట్లకు కలెక్షన్లు వచ్చాయి. ఫైటర్‌కు అందులో సగం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం, టాక్ ఏమంత గొప్పగా లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ‘పైటర్’ ఇండియా కలెక్షన్లు శుక్రవారం 42 కోట్ల దాకా రావడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది.
శనివారం కూడా తొలి రోజు కంటే ఎక్కువగా రూ.27 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ వసూళ్లు మూడు రోజులకే వంద కోట్లు దాటిపోయాయి. ఆదివారానికి బుకింగ్స్ బాగానే ఉన్నాయి. 40 కోట్ల మార్కును టచ్ కావచ్చని అంచనా. వీక్ డేస్ ఒక మోస్తరు వసూళ్లు సాధించినా.. రెండో వీకెండ్లో మళ్లీ మంచి కలెక్షన్లు రావచ్చు. ఆ రకంగా సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.
This post was last modified on January 28, 2024 3:30 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…