హనుమాన్ విజయంలో మాస్ మహారాజా పాత్రను ఎవరూ విస్మరించలేరు. ప్రత్యక్షంగా కనిపించకపోయినా కోటి అనే కోతి పాత్రకు డబ్బింగ్ ఇచ్చి గమ్మత్తమైన మాడ్యులేషన్ తో గొంతు చాలా ప్లస్ అయ్యింది. గతంలో మర్యాద రామన్నలో సైకిల్ కి ఇదే తరహాలో మాటలు ఇచ్చిన రవితేజ దాని సక్సెస్ లోనూ పాలు పంచుకున్నాడు. ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ భవిష్యత్తులో తాను సృష్టించబోయే సూపర్ హీరో సినిమాటిక్ యునివర్స్ లో వీలైతే ఒక భాగాన్ని ఆయనతోనే తీస్తానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. అంటే కోటి పాత్రనే మనిషిగా మార్చే ప్రయత్నమన్నమాట.
దీనికి టైం ఎక్కువే పట్టొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టాలి. డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న అధీరా బాధ్యతను వేరొకరికి ఇచ్చే ఆలోచన జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా హనుమాన్ షూటింగ్ అయిపోయాక ఒక చిన్న రామ్ కామ్ తీశారనే ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. సో రవితేజతో అనుకున్న కాన్సెప్ట్ తెరకెక్కడానికి ఎంత లేదన్నా రెండేళ్ల సమయం పట్టొచ్చు.
తేజ సజ్జను ముందు హీరోగా తర్వాత స్టార్ గా మార్చడం పట్ల ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఒక స్నేహితుడిని ఇలా చూసుకోవడం కన్నా గొప్ప ఫీల్ ఏముంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రెండు వందల యాభై కోట్ల గ్రాస్ దాటేసిన హనుమాన్ ఇంకో రెండు వారాలకు పైగానే సాలిడ్ రన్ సాధించే అవకాశాలున్న నేపధ్యంలో నిర్మాతలు ప్రమోషన్లను ఆపడం లేదు. క్రమం తప్పకుండా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తూనే ఉన్నారు. అన్నట్టు ఇంకో రీమాస్టర్ వెర్షన్ ని సిద్ధం చేస్తున్నామని ప్రశాంత్ వర్మ చెప్పడం కొసమెరుపు. ఏమైనా అదనపు సీన్లు జోడిస్తారేమో వేచి చూడాలి.
This post was last modified on January 27, 2024 6:03 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…