గతంలో హనుమాన్ ని మించిన బ్లాక్ బస్టర్స్ ఎన్నో వచ్చాయి కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ గా కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకునేలా కొత్త సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న ఏకంగా 5 కోట్ల 30 లక్షలకు పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ లో పదిహేనో రోజు ఇంత మొత్తం రాబట్టిన మొదటి సినిమాగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుందని ట్రేడ్ టాక్. దీనికన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో సుమారు 3 కోట్ల 70 లక్షలతో అల వైకుంఠపురములో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బాహుబలి 2, ఎఫ్2, ఆర్ఆర్ఆర్, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, కార్తికేయ 2, బాహుబలి, రంగస్థలం, గుంటూరు కారం, సరైనోడు ఉన్నాయి.
దీన్ని బట్టి రిపబ్లిక్ డేకి హనుమాన్ ఏ రేంజ్ లో జనాన్ని థియేటర్లకు రప్పించిందో అర్థం చేసుకోవచ్చు. నైజామ్ లో తొలి రోజు కేవలం నాలుగు సింగల్ స్క్రీన్లు దక్కించుకుని ఇప్పుడు ఏకంగా యాభై కోట్ల గ్రాస్ దాటేసి ఇది కొనడం మిస్ చేసుకున్న వాళ్లకు నిద్రని దూరం చేస్తోంది. ఇంత పోటీలోనూ ఇలాంటి ఫిగర్లు నమోదు చేయడం మాములుగా స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ హనుమంతుడి సహాయంతో తేజ సజ్జ ఈ మార్కు అందుకోవడం ఊహకందనిది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు దాటేసిన హనుమాన్ ఇవాళ సగర్వంగా ఇంకో విజయ వేడుకను నిర్వహించుకుంది.
చూస్తుంటే మొదట కష్టమేమో అనుకున్న మూడు వందలు కోట్లు సాధ్యమే అనిపిస్తోంది. ఫిబ్రవరి 9 దాకా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేవు. అప్పటిదాకా ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ హనుమానే ఉంటుంది. గుంటూరు కారం, నా సామిరంగ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ హనుమాన్ కి దరిదాపుల్లో లేవన్నది వాస్తవం. నిర్మాతలు, దర్శకుడు, హీరో చాలా ఎమోషనల్ గా ఫీలవ్వడం ఇవాళ సక్సెస్ మీట్ లో ప్రధానాంశం. ఇంకో పన్నెండు రోజుల్లో రవితేజ ఈగల్ వస్తోంది. సో హనుమాన్ స్పీడ్ వీక్ డేస్ లో తగ్గినా వారాంతాలు, సెలవుల్లో మాత్రం లంకను తగలబెట్టిన రేంజ్ లో భీభత్సం చేస్తున్నాడు.
This post was last modified on January 27, 2024 3:51 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…