కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్ మొన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు సరైన సమయానికి నిర్మాత ప్లానింగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా తర్వాత చూసుకుందామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడదే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి.
తీరా చూస్తే ఈ మలైకోట్టై వాలిబన్ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. రివ్యూలలో విమర్శకులు గట్టిగా తలంటారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్ తో పాటు తీసికట్టు దర్శకత్వంతో వృథా అయ్యాయని విరుచుకుపడ్డారు. మొదటి రోజు పదిహేను కోట్ల దాకా రాబట్టినా తర్వాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టుకోలేక విపరీతంగా డ్రాప్ అయ్యింది. ఇంతకు మందు మనదగ్గర మరక్కార్ అరేబియా సముద్ర సింహం సైతం ఇదే ఫలితాన్ని అందుకుంది కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది.
దీనికంతా బాద్యుడిగా దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీని పేర్కొంటున్నారు విశ్లేషకులు. బాహుబలి లాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని కథా కథనాలు, ఎమోషన్లు ఆ స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని తలంటుతున్నారు. మోహన్ లాల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసులోనూ దేహ దారుఢ్యాన్ని పెంచుకుని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు. సీక్వెల్ కూడా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ రిజల్ట్ చూసి ముందుకెళ్లడం అనుమానమే. ఉత్తి హంగులతో సినిమా ఆడే రోజులా ఇవి. స్టార్ హీరోలకైనా పరాభవం తప్పదు.
This post was last modified on January 27, 2024 11:49 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…