బాక్సాఫీస్ వద్ద సంచనాలు నమోదు చేస్తున్న హనుమాన్ గురించి మనమే కాదు హాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా స్ఫూర్తి చెందుతున్నారు. ప్రశాంత్ వర్మ తీసిన దాన్నుంచని చెప్పడం లేదు కానీ అంజనీ పుత్రుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఒక మాడరన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇంగ్లీష్ లో రూపొందటం విశేషం. అదే ‘మంకీ మ్యాన్’. 2008లో వచ్చిన ఆస్కార్ విజేత స్లమ్ డాగ్ మిలియనీర్ గుర్తుందిగా. అందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన దేవ్ పటేల్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. పదికి పైగానే ఆంగ్ల చిత్రాల్లో నటించి పాపులరయ్యాడు. తాజాగా దర్శకుడిగా మారుతున్నాడు.
అంతర్జాతీయ నిర్మాణ సంస్థ యునివర్సల్ పిక్చర్స్ నిర్మించిన మంకీ మ్యాన్ ఏప్రిల్ 5 రిలీజ్ కానుంది. నిన్న ట్రైలర్ విడుదల చేస్తే ఇరవై నాలుగు గంటలోనే రెండు మిలియన్ల వ్యూస్ దాటేసింది. కథంతా ఇండియాలోనే జరుగుతుంది. హనుమంతుడిని ఆధారంగా చేసుకున్న ఆధ్యాత్మికతను చీకటి ప్రపంచానికి ముడిపెట్టి హీరో కుళ్లిపోయిన మాఫియా మీద ఎలా తిరగబడ్డాడనే పాయింట్ మీద ఇది రూపొందింది. అడవి శేష్ గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించింది. విపిన్ శర్మ, మకరంద్ దేశ్ పాండే లాంటి బాలీవుడ్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు.
చూస్తుంటే మన ఇతిహాసాల సూపర్ హీరోలు ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లోనూ ఎంట్రీ ఇస్తున్నారు. విజువల్స్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. దేవర ముందు అనుకున్న డేట్ కి ఈ మంకీ మ్యాన్ ని తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. అలా అని ఇదేదో భక్తిలో ముంచెత్తే సినిమా మాత్రం అనుకోకండి. కేవలం హనుమాన్ ని ఒక అంశంగా తీసుకుని దాన్ని సోషల్ డ్రామాలో వాడుకునే ప్రయత్నం చేశారు. ఇది హిట్ అయితే ఇదే తరహాలో మరికొందరు మన గాథలను వాడుకోవడం ఖాయం
This post was last modified on January 27, 2024 11:34 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…